Wednesday, March 18, 2026
HomeసినిమాTantra: సలోని ఇందులో డిఫరెంట్‌గా కనిపిస్తారు: 'తంత్ర' మూవీ టీమ్‌

Tantra: సలోని ఇందులో డిఫరెంట్‌గా కనిపిస్తారు: ‘తంత్ర’ మూవీ టీమ్‌

సలోని ప్రస్తుతం ‘తంత్ర’ చిత్రంతో రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. అనన్య నాగళ్ల ప్రధాన పాత్ర పోషిస్తున్నఈ చిత్రంలో సలోని ఓ కీలక పాత్ర పోషించనున్నారు. ఫస్ట్‌ కాపీ మూవీస్‌, బి ద వే ఫిల్మ్స్‌, వైజాగ్ ఫిల్మ్‌ ఫ్యాక్టరీ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంతో శ్రీనివాస్‌ గోపిశెట్టి అనే కొత్త దర్శకుడు పరిచయం అవుతున్నారు.

హారర్‌ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం పోస్టర్‌ను నిర్మాణ సంస్థ విడుదల చేయగా చక్కని స్పందన వచ్చింది. భయంకరమైన క్షుద్రశక్తులు అనన్యని పీడిస్తున్నట్టుగా కనపడుతున్న పోస్టర్‌ ఆసక్తికరంగా ఉంది. నటుడు శ్రీహరి తమ్ముడి కొడుకు ధనుష్‌ ఈ చిత్రంతో హీరోగా పరిచయమవుతున్నాడు.

ఈ మేరకు దర్శ నిర్మాతలు మాట్లాడుతూ  ‘‘ఫీమేల్‌ ఓరియెంటెడ్‌ లైన్‌తో రూపొందుతున్న హారర్‌ ఎంటర్‌టైనర్‌ ఇది. భారతీయ తాంత్రిక శాస్త్రం, పురాణగాఽథల నేపథ్యంలో ఆద్యంతం ఉత్కంఠగా స?గుతుంది. తంత్ర శాస్ర్తానికి చెందిన విస్తు గొలిపే రహస్యాలను ఈ చిత్రం ద్వారా చెప్పబోతున్నాం.

ఇందులో అనన్య నాగళ్లతోపాటు సలోని కీ రోల్‌ పోషిస్తున్నారు. గాళ్‌ నెక్ట్స్‌ డోర్‌ రోల్‌తోపాటు గ్లామర్‌ పాత్రలతోనూ మెప్పించిన సలోని ఇందులో డిఫరెంట్‌గా కనిపిస్తారు. నటనకు ఆస్కారమున్న పాత్ర అది. ఇటీవల అనన్యా, సలోని, హీరోపై కీలక సన్నివేశాలను చిత్రీకరించాం. అవుట్‌పుట్‌బాగా వచ్చింది. ఈ చిత్రం టీమ్‌ అందరికీ మంచి పేరు తీసుకురావడంతోపాటు సలోనికి మంచి కమ్‌బ్యాక్‌ అవుతుంది’’ అని తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular