Monday, February 24, 2025
HomeసినిమాSamyuktha Menon: సక్సెస్ బాటలో సంయుక్త జోరు!

Samyuktha Menon: సక్సెస్ బాటలో సంయుక్త జోరు!

సంయుక్త మీనన్ .. మంచి హైటూ .. అందుకు తగిన ఆకర్షణీయమైన రూపం ఆమె సొంతం. కేరళ నుంచి టాలీవుడ్ కి వచ్చిన అందమైన హీరోయిన్స్ లో ఆమె ఒకరు. మలయాళ సినిమాలతో తన కెరియర్ ను మొదలుపెట్టిన ఆమె, ఆ తరువాత తమిళ సినిమాల దిశగా అడుగులు వేసింది. అలా తన కెరియర్ మొదలైన నాలుగేళ్లకు ఆమె టాలీవుడ్ పై దృష్టి పెట్టింది. ఇక్కడ ముందుగా ఆమె సైన్ చేసిన సినిమా ‘బింబిసార’ అయినప్పటికీ, విడుదలైన సినిమా మాత్రం ‘భీమ్లా నాయక్’.

ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది. దాంతో సంయుక్త పేరు అందరికీ తెలిసింది. ఆ తరువాతనే ‘బింబిసార’ థియేటర్లకు వచ్చింది. కల్యాణ్ రామ్ జోడీగా ఆమె చేసిన ఈ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లను నమోదు చేసింది. అమ్మాయి ఎవరో అదృష్టవంతురాలే అనుకుంటూ ఉండగానే, ధనుశ్ సరసన నాయికగా ‘సార్’ (వాతి) చేసింది. ఈ రెండు భాషల్లోను ఈ సినిమా హిట్ టాక్ ను సంపాదించుకుంది. సంయుక్త సక్సెస్ రేటును మరింత పెంచింది.

నిజం చెప్పాలంటే ఆ సినిమాలు హిట్ అయినప్పటికీ, ఆమె చేసిన రోల్స్ అంత ముఖ్యమైనవేం కాదు. ఆమెకి నటన పరంగా స్కోప్ దొరికిన సినిమా ఏదైనా ఉందంటే అది ‘విరూపాక్ష‘నే. ఈ సినిమాలో గ్రామీణ యువతిగా … ఆత్మ ఆవహించిన వ్యక్తిగా ఆమె బాగా చేసింది. ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల జాబితాలో చేరిపోయింది. మొత్తానికి సంయుక్త  మిగతా హీరోయిన్స్ కి గట్టిపోటీనే ఇస్తోంది. ఆమె సక్సెస్ గ్రాఫ్ ఒక రేంజ్ దూసుకుపోతూనే ఉంది.

Also Read: Virupaksha Review: కదలకుండా కూర్చోబెట్టిన కథ .. విరూపాక్ష

RELATED ARTICLES

Most Popular

న్యూస్