Sunday, January 19, 2025
Homeసినిమామళ్లీ తెలుగు ఆడియన్స్ ముందుకు సునైనా!

మళ్లీ తెలుగు ఆడియన్స్ ముందుకు సునైనా!

తెలుగు తెరకి ఎప్పటికప్పుడు కొత్త కథానాయికలు పరిచయమవుతూనే ఉంటారు. కొంతమంది హీరోయిన్లు ఒకటి రెండు సినిమాలతో బిజీ అవుతారు. మరికొంతమందికి బ్రేక్ ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి ఏర్పడుతుంది. అలా తన కెరియర్ ను తెలుగు సినిమాలతో మొదలు పెట్టేసి, ఆ తరువాత సరైన బ్రేక్ రాకపోవడంతో తమిళ సినిమాలపై దృష్టి పెట్టిన కథానాయికగా సునైన కనిపిస్తుంది.నిజానికి సునైన పేరు వినగానే ఆమె ఎవరనేది కళ్లముందు కదలడం కష్టమే. ఎందుకంటే తెలుగు తెరకి ఆమె 2005లో పరిచయమైనా ఆమె చేసిన సినిమాలు చాలా తక్కువ.

టాలీవుడ్ తెరకి ఈ బ్యూటీ ‘కుమార్ వర్సెస్ కుమారి’ సినిమాతో పరిచయమైంది. ఆ తరువాత ఆమె చేసిన సినిమాలు .. పాత్రలు కూడా అంతగా గుర్తుపెట్టుకునీవేం కాదు. తెలుగులో తనకి మంచి రోజులు రాకపోతాయా అని చెప్పేసి సునైన ఎదురుచూస్తూ సమయాన్ని వృథా చేయలేదు. కోలీవుడ్ కి వెళ్లి అక్కడ ఆమె చేసిన ప్రయత్నాలు బాగానే ఫలించాయి. దాంతో అక్కడ ఆమె వరుస సినిమాలతో బిజీ అయిపోయింది. మధ్యలో టాలీవుడ్ వైపు తొంగిచూసినట్టుగా ఆమె చేసిన ‘రాజరాజచోర’ ఆమెకి మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. కానీ ఆమె తమిళ సినిమాలను మాత్రం వదులుకునే పరిస్థితి లేదు.

తమిళంలో విశాల్ సరసన నాయికగా ఆమె ‘లాఠీ’ సినిమా చేసింది. వినోద్ కుమార్ దర్శకత్వం వహించాడు. గతంలో విశాల్ జోడిగా సునైనా చేసింది. ఇద్దరూ కలిసి చేసిన రెండవ సినిమా ఇది. ఈ సినిమాను తమిళంతో పాటు తెలుగులోను రిలీజ్ చేస్తున్నారు. అందువల్లనే నిన్న హైదరాబాదులో టీజర్ లాంచ్ ఈవెంటును నిర్వహించారు. తెరపై సీరియస్ గా కనిపించే విశాల్ గారు సెట్లో చాలా సరదాగా ఉంటారు. ఆయనతో కలిసి మరో మంచి సినిమా చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమా తప్పకుండా పెద్ద హిట్ అవుతుందనే నమ్మకం ఉంది” అంటూ ఆశా భావాన్ని వ్యక్తం చేసింది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్