Tuesday, February 25, 2025
Homeసినిమాబాలీవుడ్ నటుడితో ప్రేమ బంధాన్ని ఒప్పుకున్న తమన్నా

బాలీవుడ్ నటుడితో ప్రేమ బంధాన్ని ఒప్పుకున్న తమన్నా

తమన్న ఎట్టకేలకు తన ప్రేమ రహస్యాన్ని చెప్పేసిందని చెప్పాలి. తాను విజయ్ వర్మతో రిలేషన్ లో ఉన్నానంటూ క్లారిటీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ..తాజాగా అతనితో కలిసి ఫోటోలను కూడా షేర్ చేసింది. ప్రముఖ హీరోయిన్ తమన్నా భాటియా ప్రేమలో పడ్డారన్న విషయం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఏడాది జనవరి నుంచి ఆమె నటుడు విజయ్ వర్మతో సన్నిహితంగా ఉంటున్న ఫోటోలు నెట్టింట చాలా వైరల్ గా మారుతున్నాయి.

‘మా ఇద్దరి మధ్య చాలా ఆర్గానిక్‌గా బంధం ఉంది. తను నాకు రక్షణగా నిలబడతాడనే నమ్మకం ఉంది. నా మనసుకు దగ్గరైన వ్యక్తి. నేను చాలా శ్రద్ధ వహించే వ్యక్తి అతను. తను ఉన్న చోటే నాకు సంతోషకరమైన ప్రదేశం’ అని తమన్నా చెప్పుకొచ్చింది. కాగా, ఇటు తెలుగుతో పాటు అటు బాలీవుడ్‌లో వరుస సినిమాలు, సిరీస్‌ లతో తమన్నా బిజీగా ఉంది. టాలీవుడ్‌లో మెగాస్టార్ చిరంజీవి సరసన భోళా శంకర్ సినిమాలో నటిస్తోంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్