Sunday, February 23, 2025
Homeసినిమా‘ఆడతనమా చూడతరమా’ ఫస్ట్ లుక్ విడుదల

‘ఆడతనమా చూడతరమా’ ఫస్ట్ లుక్ విడుదల

శ్రీమతి ఉషశ్రీ సమర్పణలో శ్రీ దత్తాత్రేయ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించబడిన చిత్రం ‘ఆడతనమా చూడతరమా’. మన్యం కృష్ణ, అవికా రావ్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాతో పండు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ ను దర్శకుడు సాగర్ చంద్ర విడుదల చేశారు.

ఈ సందర్భంగా దర్శకుడు పండు మాట్లాడుతూ… మా ‘ఆడతనమా చూడతనమా’ ఫస్ట్ లుక్ విడుదల చేసిన డైరెక్టర్ సాగర్ చంద్ర గారికి ధన్యవాదాలు. నన్ను నమ్మి ఈ ప్రాజెక్ట్ ఇచ్చిన నిర్మాత సుబ్బారెడ్డి గారికి ధన్యవాదాలు, అందరికి నచ్చే విధంగా ఈ సినిమా ఉండబోతోంది. త్వరలో మా సినిమా ట్రైలర్ ను విడుదల చెయ్యబోతున్నాం” అన్నారు.

నిర్మాత సుబ్బారెడ్డి మాట్లాడుతూ “డైరెక్టర్ పండు మంచి కాన్సెప్ట్ తో ఆడతనమా చూడతరమా సినిమాను తెరకెక్కించారు. సినిమా బాగా వచ్చింది, పాటల మినహ చిత్రీకరణ పూర్తి అయ్యింది. మా దత్తాత్రేయ క్రియేషన్స్ బ్యానర్ లో వస్తోన్న మొదటి సినిమాకు మీ అందరి సపోర్ట్ కావాలి. మా సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేసిన సాగర్ చంద్ర గారికి ధన్యవాదాలు” అన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్