Saturday, January 18, 2025
Homeసినిమాఆదిపురుష్ 2 కూడా ఉంటుందా?

ఆదిపురుష్ 2 కూడా ఉంటుందా?

Adipurush: పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్, కేజీఎఫ్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ కాంబినేష‌న్లో రూపొందుతోన్న భారీ చిత్రం స‌లార్. ఈ మూవీ ఫ‌స్ట్ లుక్ కు అనూహ్య‌మైన స్పంద‌న వ‌చ్చింది. ప్ర‌భాస్ ని అభిమానులు ఎలా చూడాల‌నుకుంటారో అలా ఈ సినిమా ఉండ‌బోతుందని అర్థం అవుతోంది. ఈ మూవీ ఫ‌స్ట్ లుక్ కి వ‌చ్చిన స్పంద‌న‌తో స‌లార్ పార్ట్ 2 కూడా ప్లాన్ చేస్తున్నారు. ఈ మ‌ధ్య పార్ట్ 2ల ట్రెండ్ బాగా న‌డుస్తోంది. బాహుబ‌లి 2 వ‌చ్చింది. సోగ్గాడే చిన్ని నాయ‌నా చిత్రానికి పార్ట్ 2 లా బంగార్రాజు వ‌చ్చింది.

పుష్ప 2, కార్తికేయ 2 చిత్రాలు రాబోతున్నాయి. అలాగే స‌లార్ 2 కూడా రాబోతోంది. రెండు పార్ట్ లుగా తీస్తే.. నిర్మాత‌కు మ‌రంత లాభం అని బాగా అర్థ‌మైంది. అందుక‌నే సినిమా స‌క్స‌స్ అయితే పార్ట్ 2 అంటూ మ‌రో సినిమా స్టార్ట్ చేస్తున్నారు. ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే.. ఆదిపురుష్ మూవీ కూడా రెండు పార్టులుగా రానుంద‌ని సమాచారం. రామాయణ నేపథ్యంలో ప్రభాస్‌ నటిస్తున్న చిత్రమిది. ఓం రౌత్‌ దర్శకుడు. కృతిసనన్‌ కథానాయికగా నటిస్తోంది.

ప్ర‌స్తుతం షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుపుకుంటోంది. ఆదిపురుష్ మూవీకి సీక్వెల్‌ చేసే ఆలోచనలో చిత్రబృందం ఉందని టాక్ వినిపిస్తోంది. 2023 జనవరి 12న ఆదిపురుష్‌ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయ‌నున్నారు. ఆదిపురుష్ చిత్రం ఆశించిన విజయం సాధిస్తే.. సీక్వెల్ తీయాల‌ని ఫిక్స్ అయ్యార‌ని స‌మాచారం.

Also Read : ఆదిపురుష్ లో ఒక్క సీన్ కోసం అంత బ‌డ్జెట్టా..? 

RELATED ARTICLES

Most Popular

న్యూస్