Saturday, January 18, 2025
Homeసినిమా'సలార్'కి షాక్ ఇచ్చిన 'ఆదిపురుష్'

‘సలార్’కి షాక్ ఇచ్చిన ‘ఆదిపురుష్’

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుసగా సినిమాలు చేస్తూ.. ఫుల్ బిజీగా ఉన్నారు. అయితే.. ఆదిపురుష్‌ మూవీని సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ చేయనున్నట్టుగా ప్రకటించారు. అయితే.. ఆదిపురుష్ టీజర్ రిలీజ్ చేసిన తర్వాత డివైడ్ టాక్ రావడంతో ఏం చేయాలో తెలియక మేకర్స్ టెన్షన్ పడ్డారు. ఆదిపురుష్ మూవీ భారతదేశం గర్వించే సినిమా చేస్తామని.. దీని కోసం కొంత సమయం పడుతుంది అంటూ సినిమాను వాయిదా వేశారు. జనవరి 12న కాకుండా.. జూన్ 16న ఆదిపురుష్ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నట్టుగా ప్రకటించారు.

ఇదిలా ఉంటే.. ఆదిపురుష్ జనవరిలో వస్తే.. సలార్ మూవీని సెప్టెంబర్ లో రిలీజ్ చేయాలి అనుకున్నారు. ఇప్పుడు ఆదిపురుష్ మేకర్స్ ట్విస్ట్ ఇచ్చారు. ముందు ప్రకటించినట్టుగా సలార్ చిత్రాన్ని సెప్టెంబర్ లో రిలీజ్ చేద్దామంటే.. కేవలం మూడు నెలల గ్యాప్ తో ప్రభాస్ లాంటి ప్యాన్ ఇండియా స్టార్ మూవీస్ రెండు రిలీజ్ చేయడం బిజినెస్ కోణంలో కరెక్ట్ కాదు. పైగా బయ్యర్లు సైతం దీనికి నో అనే చెబుతారు. దర్శకుడు ఓం రౌత్ దేశం మొత్తం గర్వపడే సినిమా తీస్తున్నామని అందుకే జాప్యం తప్పడం లేదని కవరింగ్ చేసుకునే ప్రయత్నం ప్రభాస్ ఫ్యాన్స్ లో ఒకవర్గానికి మాత్రమే కన్విన్సింగ్ గా అనిపిస్తే అధిక శాతం మాత్రం కోపంగా ఉన్నారు.

ఇప్పుడు సలార్ పరిస్థితి కక్కలేక మింగలేక అన్నట్టు తయారయ్యింది. ఆదిపురుష్ జూన్ లో వస్తుంది కాబట్టి మనం ఏ డిసెంబర్ కో లేదా 2024 సంక్రాంతికో షిప్ట్ అవుదామా అంటే టి సిరీస్ వ్యవహారాలను అంత ఈజీగా నమ్మలేం. మళ్ళీ ఏ మేలోనో ఇంకా పనవ్వలేదు అగైన్ పోస్ట్ పోన్ అంటే ఎవరేం చేయగలరు. రాధే శ్యామ్, సాహోలకు జరిగింది ఇదే. ఎక్కడో ఉరుము ఉరిమితే ఇంకెక్కడో పిడుగు పడ్డట్టు ప్రభాస్ ఒకేసారి ఇన్నేసి సినిమాలు చేయడం వల్లే ఇలాంటి ఇబ్బందులు తలెత్తున్నాయి. మరి.. ఆదిపురుష్, సలార్ రిలీజ్ డేట్ లు ఇంకెన్ని సార్లు మారతాయో..? ఎప్పటికీ థియేటర్లోకి వస్తాయో..?

RELATED ARTICLES

Most Popular

న్యూస్