Sunday, January 19, 2025
Homeసినిమాఆదిపురుష్‌, స‌లార్ ఇంట్ర‌స్టింగ్ అప్ డేట్స్.

ఆదిపురుష్‌, స‌లార్ ఇంట్ర‌స్టింగ్ అప్ డేట్స్.

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్, బాలీవుడ్ డైరెక్ట‌ర్ ఓంరౌత్ కాంబినేష‌న్లో రూపొందుతోన్న భారీ చిత్రం ఆదిపురుష్. ఈ చిత్రం రామాయ‌ణం ఆధారంగా రూపొందుతుండ‌డంతో భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. ఇందులో శ్రీరాముడుగా ప్ర‌భాస్ న‌టిస్తుండ‌డంతో ఎప్పుడెప్పుడు ఆదిపురుష్ ఫ‌స్ట్ లుక్ చూస్తామా..? ఎప్పుడెప్పుడు సినిమా చూస్తామా..? అని అభిమానులు ఆతృత‌గా ఎదురు చూస్తున్నారు.

శ్రీరామ‌న‌వ‌మికి ఆదిపురుష్ ఫ‌స్ట్ లుక్ వ‌స్తుంది అనుకున్నారు కానీ.. మేక‌ర్స్ రిలీజ్ చేయ‌లేదు. తాజా అప్ డేట్ ఏంటంటే.. ప్ర‌భాస్ పుట్టిన‌రోజు అక్టోబ‌ర్ 23. ఆ రోజున ఆదిపురుష్ ఫ‌స్ట్ లుక్ రిలీజ్ చేయాల‌ని డిసైడ్ అయ్యార‌ట మేక‌ర్స్. ఇక స‌లార్ అప్ డేట్ ఏంటంటే.. కేజీఎఫ్ 2 సినిమాలతో సంచలనం సృష్టించిన‌ ప్రశాంత్ నీల్ ఈ మూవీకి దర్శకుడు కావడంతో సలార్ పై ఎన్నో అంచనాలు నెలకొన్నాయి. గనుల నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో యాక్షన్ ఎపిసోడ్స్‌ను ఓ రెంజ్‌ల ప్రశాంత్‌ నీల్‌ డిజైన్ చేశాడట. సినిమా మొదలైన దగ్గర నుంచి ఒక సీన్‌కి మించి మరో సీన్ ఉండేలా ఆయన ప్లాన్ చేశాడని అంటున్నారు.

ఈ సినిమా చాలా ఫాస్టుగా మొదలైనప్పటికీ అంతే ఫాస్టుగా షూటింగు జరుపుకోలేకపోయింది. ఇప్పటి వరకు 35 శాతం మాత్రమే చిత్రీకరణ జరుపుకుందట. ఇక పై సలార్‌ షూటింగు ఆగకుండా వరుస షెడ్యూల్స్‌ను ఆయన ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. అందుకు తగిన విధంగా ప్రభాస్ డేట్స్ తీసుకోవడం కూడా జరిగిపోయిందని అంటున్నారు. మ‌రి.. స‌లార్ తో చ‌రిత్ర సృష్టిస్తాడేమో చూడాలి.

Also Read : ఆదిపురుష్ 2 కూడా ఉంటుందా? 

RELATED ARTICLES

Most Popular

న్యూస్