Sunday, January 19, 2025
HomeసినిమాAdipurush: 3 రోజుల ముందే 'ఆదిపురుష్' ప్రీమియర్

Adipurush: 3 రోజుల ముందే ‘ఆదిపురుష్’ ప్రీమియర్

ప్రభాస్, ఓంరౌత్ కాంబినేషన్లో రూపొందుతోన్న మూవీ ‘ఆదిపురుష్’. భారతీయ చరిత్ర, సంస్కృతిలో గొప్ప ఇతిహాసం, రామాయణ వర్ణనను చూడటానికి ప్రేక్షకులు చాలా ఉత్సాహంగా ఉన్నారు. జూన్ 7-18 వరకు జరిగే ట్రిబెకా ఫెస్టివల్‌లో జూన్ 13న న్యూయార్క్‌లో ఈ చిత్రం వరల్డ్ ప్రీమియర్ ప్రదర్శించబడుతుంది. ఈ సినిమా జూన్ 16న ఇండియాతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఆదిపురుష్ మూవీ విడుదల కానుంది.

ట్రిబెకా ఫెస్టివల్ కోసం లైనప్ ప్రకటించబడింది. జ్యూరీ వరల్డ్ ప్రీమియర్‌ కోసం ఆదిపురుష్‌ని ఎంపిక చేసింది. 2001లో రాబర్ట్ డి నీరో, జేన్ రోసెంతల్ మరియు క్రెయిగ్ హాట్‌కాఫ్‌లచే స్థాపించబడిన OKX ద్వారా సమర్పించబడిన ట్రిబెకా ఫెస్టివల్, కళాకారులు, విభిన్న ప్రేక్షకులను ఒకచోట చేర్చి అన్ని రకాల కథలను పంచుకుంటారు. ట్రిబెకా ఫిలిం ఫెస్టివల్ సృజనాత్మక, వినోదానికి పర్యాయపదంగా ఉంది. విజువల్ ఫీస్ట్‌గా రాబోతోన్న ఆదిపురుష్ 3D ఫార్మాట్‌లో “మిడ్‌నైట్ ఆఫరింగ్”గా ఫెస్టివల్‌లో ప్రదర్శించబడుతుంది.

ఓం రౌత్ మాట్లాడుతూ…. “ఆదిపురుష్ సినిమా కాదు, ఇది ఒక ఎమోషన్, సెంటిమెంట్. ఇది భారతదేశ స్ఫూర్తితో ప్రతిధ్వనించే కథ. ఒక విద్యార్థిగా నేను ఎప్పుడూ ఉండాలని కోరుకునే ప్రపంచంలోని ప్రతిష్టాత్మక చలన చిత్రోత్సవాలలో ఒకటైన ట్రెబెకా జ్యూరీ ఆదిపురుష్‌ని ఎంపిక చేసిందని తెలుసుకున్నప్పుడు చాలా హ్యాపీగా ఫీలయ్యాను. సంతోషకరమైన మూమెంట్. మన సంస్కృతిలో బాగా పాతుకుపోయిన కథను ప్రపంచ వేదికపై ప్రదర్శించబోతున్నారు. ప్రపంచ ప్రీమియర్‌లో ప్రేక్షకుల స్పందన చూసి మేము నిజంగా థ్రిల్‌గా ఫీల్ అవుతాం.

ప్రభాస్‌ మాట్లాడుతూ.. “న్యూయార్క్‌లోని ట్రిబెకా ఫెస్టివల్‌లో ఆదిపురుష్ వరల్డ్ ప్రీమియర్‌ను ప్రదర్శించడం నాకు గర్వకారణం. మన దేశం యొక్క నైతికతకు అద్దం పట్టే ప్రాజెక్ట్‌లో భాగం కావడం అదృష్టం. మన భారతీయ చిత్రాలను చూడటం, ముఖ్యంగా ఆదిపురుష్, ప్రపంచ స్థాయికి చేరుకోవడం నాకు నటుడిగానే కాకుండా భారతీయుడిగా కూడా చాలా గర్వంగా ఉంది. ట్రిబెకాలో ప్రేక్షకుల స్పందన కోసం నేను ఎదురు చూస్తున్నాను” అన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్