Thursday, March 12, 2026
Homeసినిమామొదటి రోజే 140 కోట్లు కలెక్ట్ చేసి రికార్డ్ సృష్టించిన 'ఆదిపురుష్'

మొదటి రోజే 140 కోట్లు కలెక్ట్ చేసి రికార్డ్ సృష్టించిన ‘ఆదిపురుష్’

ప్రభాస్, కృతి సనన్, సైఫ్ అలీఖాన్ నటించిన ‘ఆదిపురుష్’ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్ల తోనే బాక్సాఫీస్ వద్ద భారీ తుఫాను సృష్టించిన ఈ సినిమా గ్లోబల్ బాక్స్ ఆఫీస్ వద్ద 140 కోట్లతో అద్భుతమైన ఓపెనింగ్ డే రెస్పాన్స్‌ని అందుకుంది. బిజినెస్ పరంగా కూడా ఆదిపురుష్ మొదటి రోజు బాక్సాఫీస్ ను షేక్ చేసింది. టాప్ 5 లో నిలిచిన ఏకైక హిందీ చిత్రంగా రికార్డ్ సృష్టించింది ఈ సినిమా.

అన్నీ షోస్ హౌస్‌ఫుల్‌ గా నడుస్తుండడంతో, ఆదిపురుష్ అన్ని వయసుల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ప్రతి ఫ్రేమ్‌ తో పిల్లలకు మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తోంది ఈ సినిమా. ఈ మాగ్నమ్ ఓపస్ ఒక విజువల్ ట్రీట్ గా మొదటి నుండి చివరి వరకు యువత ను కట్టిపడేస్తుంది. అందరికీ ఒక మరపురాని అనుభూతిని కలిగిస్తున్న ఈ చిత్రం కలెక్షన్ల పరంగా కూడా స్ట్రాంగ్ గా కొనసాగుతూ ప్రపంచ వ్యాప్తంగా కూడా రికార్డులు సృష్టిస్తోంది.

ఆదిపురుష్ సినిమా కి ఓం రౌత్ దర్శకత్వం వహించారు. మరియు T-సిరీస్, భూషణ్ కుమార్ & క్రిషన్ కుమార్, ఓం రౌత్, ప్రసాద్ సుతార్ మరియు రెట్రో ఫైల్స్‌కు చెందిన రాజేష్ నాయర్ మరియు UV క్రియేషన్స్‌పై వంశీ, ప్రమోద్ సంయుక్తంగా నిర్మించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular