Saturday, September 21, 2024
Homeసినిమా'ఆదిపురుష్' ప్రమోషన్స్ ప్లాన్ ఏంటి..?

‘ఆదిపురుష్’ ప్రమోషన్స్ ప్లాన్ ఏంటి..?

ప్రభాస్, ఓంరౌత్ కాంబినేషన్లో రూపొందుతోన్న భారీ చిత్రం ‘ఆదిపురుష్‘. ఈ చిత్రాన్ని రామాయణం ఆధారంగా రూపొందిస్తున్నారని తెలిసినప్పటి నుంచి రాముడు గెటప్ లో ప్రభాస్ ఎలా ఉంటారో చూడాలని అభిమానులు ఆతృతగా ఎదురు చూశారు. ఆదిపురుష్‌ టీజర్ రిలీజ్ చేశారు కానీ.. ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. టీజర్ పై నెగిటివిటీ రావడంతో మళ్లీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేశారు. దీని వలన బడ్జెట్ పెరిగినా ఫరవాలేదు.. మంచి కంటెంట్ ఉన్న మూవీ అందించాలనే రాజీపడకుండా వర్క్ చేస్తున్నారు.

అందుకనే సంక్రాంతికి రావాల్సిన ఆదిపురుష్‌ మూవీని వాయిదా వేశారు. జూన్ 16న ఆదిపురుష్ మూవీని విడుదల చేస్తున్నారు. ఇంతకీ ఈ మూవీ లేటెస్ట్ అప్ డేట్ ఏంటంటే… ఈ మూవీ విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ మెజారిటీ పార్ట్ పూర్తయ్యిందని తెలిసింది. అలాగే రిలీజ్ డేట్ లో కూడా ఇంకా ఎలాంటి మార్పు ఉండదని సమాచారం. మరి.. ప్రమోషన్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారంటే… మార్చిలో ఈ మూవీ నుంచి ఒక హై వోల్టేజ్ సాంగ్ ని రిలీజ్ చేసి మూవీ ప్రమోషన్ స్టార్ట్ చేయడానికి చిత్ర యూనిట్ రెడీ అవుతుందని టాక్ వినిపిస్తోంది.

ఇక ఈ మూవీని వీలైనన్ని ఎక్కువ భాషలలో రిలీజ్ చేయడానికి టి-సిరీస్ ప్లాన్ చేస్తుంది. ఇక ఈ సినిమాలో యాక్షన్ ఎలిమెంట్స్ తో పాటు ప్రేక్షకులకి కనెక్ట్ అయ్యే ఎమోషనల్ అండ్ లవ్ ఎలిమెంట్స్ కూడా చాలా అద్భుతంగా ఉంటాయని చిత్రానికి పని చేసిన వారు చెబుతున్నారు. 90 సెకండ్స్ నిడివి ఉన్న వీడియో చూసి సినిమా ఎలా ఉంటుందో డిసైడ్ చేయకూడదని అంటున్నారు. ఇక ప్రమోషన్ లో భాగంగా రిలీజ్ చేయబోయే లేటెస్ట్ టీజర్ తో ఖచ్చితంగా మూవీ పై మరల హైప్ క్రియేట్ అవుతుందని టీమ్ నమ్మకంగా ఉన్నారు. మరి.. ఓం రౌత్ ఏం చేస్తాడో..?

Also Read : ఆదిపురుష్‌ మూవీకి పోటీగా హాలీవుడ్ మూవీ 

RELATED ARTICLES

Most Popular

న్యూస్