Sunday, January 19, 2025
Homeసినిమాఆదిపురుష్ టీజ‌ర్ రిలీజ్ ప్లాన్ అదిరింది...

ఆదిపురుష్ టీజ‌ర్ రిలీజ్ ప్లాన్ అదిరింది…

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ న‌టించిన మైథ‌లాజిక‌ల్ మూవీ ఆదిపురుష్‌. ఈ చిత్రానికి బాలీవుడ్ డైరెక్ట‌ర్ ఓంరౌత్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ  మూవీ కోసం ప్ర‌భాస్ అభిమానులే కాకుండా య‌వ‌త్ సినీ అభిమానులు అంద‌రూ ఆతృత‌గా ఎదురు చూస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకుని గత కొన్ని నెలలుగా పోస్ట్ ప్రొడక్షన్ వ‌ర్క్ జ‌రుపుకుంటుంది.

వాల్మీకి రామాయణం ఆధారంగా జపనీస్ మూవీ రామాయణ ది లెజెండ్ ఆఫ్ ప్రిన్స్ రామా స్ఫూర్తితో ఈ భారీ దృశ్య కావ్యాన్ని వెండితెర పై దర్శకుడు ఓం రౌత్ అత్యంత భారీ స్థాయిలో గ్రాఫికల్ వండర్ గా తెరకెక్కించారు. గత కొన్ని నెలలుగా ఈ మూవీ సీజీ వర్క్ జరుపుకుంటోంది. గ్రాఫిక్స్ ప్రధాన హైలైట్ గా నిలవనున్న ఈ మూవీని 3డీ ఫార్మాట్ లో రూపొందిస్తున్నారు. ప్ర‌భాస్ రాముడుగా న‌టిస్తుంటే… కృతి స‌న‌న్ సీత‌గా, సైఫ్ అలీఖాన్ రావణుడిగా నటించారు.

వచ్చేసంవ‌త్స‌రం జనవరి 12న సంక్రాంతి కానుకగా అత్యంత భారీ స్థాయిలో రిలీజ్ కు సిద్ధమవుతున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ని మేకర్స్ ఇంత వరకు రిలీజ్ చేయలేదు. అయితే.. అక్టోబర్ 2న ఈ మూవీ టీజర్ ని రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇందు కోసం అయోధ్యలోని రామజన్మ భూమిని ఎంచుకున్నట్టుగా స‌మాచారం. సినిమా రిలీజ్ కు మరింత సమయం వుండటంతో ఇప్పటి నుంచే ఈ ప్రాజెక్ట్ పై దేశ వ్యాప్తంగా బజ్ ని క్రియేట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. మ‌రి.. జ‌న‌వ‌రి 12న ఆదిపురుష్ మూవీతో ప్ర‌భాస్ చ‌రిత్ర సృష్టిస్తారేమో చూడాలి.

Also Read : ఆదిపురుష్ టీజ‌ర్ డేట్ మారిందా? 

RELATED ARTICLES

Most Popular

న్యూస్