Sunday, January 19, 2025
Homeసినిమా'ఆదిపురుష్'ని టెన్ష‌న్ పెడుతున్న 'బ్ర‌హ్మ‌స్త్ర‌'

‘ఆదిపురుష్’ని టెన్ష‌న్ పెడుతున్న ‘బ్ర‌హ్మ‌స్త్ర‌’

Range Problem: పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ న‌టిస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ ఆదిపురుష్‌. రామాయ‌ణం ఆధారంగా రూపొందుతోన్న ఈ భారీ చిత్రానికి బాలీవుడ్ బ‌డా డైరెక్ట‌ర్ ఓంరౌత్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. షూటింగ్ పూర్తి చేసుకుని ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుపుకుంటుంది. సంక్రాంతికి ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతుంది. ఇందులో ప్ర‌భాస్ రాముడుగా న‌టించ‌డంతో ఈ భారీ చిత్రాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అని అభిమానులు ఆతృత‌గా ఎదురు చూస్తున్నారు.

ఇదిలా ఉంటే.. బాలీవుడ్ లో బాహుబ‌లి రేంజ్ లో రూపొందుతోన్న భారీ చిత్రం బ్ర‌హ్మ‌స్త్ర‌. ఇందులో ర‌ణ్ బీర్ క‌పూర్, ఆలియా బ‌ట్ జంట‌గా న‌టిస్తే.. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్, టాలీవుడ్ కింగ్ నాగార్జున కీల‌క పాత్ర‌లు పోషించ‌డం విశేషం. ఇటీవ‌ల ఈ మూవీ ట్రైల‌ర్ ను రిలీజ్ చేశారు. హాలీవుడ్ రేంజ్ లో ఉన్న ఈ ట్రైల‌ర్ కు ట్రెమండ‌స్ రెస్పాన్స్ వ‌చ్చింది. రికార్డ్ వ్యూస్ తో ఈ ట్రైల‌ర్ సెన్సేష‌న్ క్రియేట్ చేసింది.

మూడు భాగాలుగా రానున్న ఈ మూవీ ట్రైల‌ర్ ఆదిపురుష్ ని టెన్ష‌న్ పెడుతుంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. కార‌ణం ఏంటంటే.. విజువ‌ల్ వండ‌ర్ అనేలా బ్రహ్మ‌స్త్ర ట్రైల‌ర్ ఉంది. దీంతో ఆదిపురుష్ అంత‌కు మంచి అనేలా ఉండాలి. లేక‌పోతే.. బ్ర‌హ్మ‌స్త్ర ముందు ఆదిపురుష్ తేలిపోతుంది అందుక‌నే ఆదిపురుష్ టీమ్ టెన్ష‌న్ ప‌డుతుంద‌ని టాలీవుడ్, బాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. మ‌రి.. బ్ర‌హ్మ‌స్త్ర‌, ఆదిపురుష్ ఈ రెండు చిత్రాల్లో ఏ సినిమా ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తుందో.. బాక్సాఫీస్ ద‌గ్గ‌ర రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్