Saturday, January 18, 2025
Homeసినిమాయూట్యూబ్ ని షేక్ చేస్తున్న‌ఆదిపురుష్ టీజ‌ర్

యూట్యూబ్ ని షేక్ చేస్తున్న‌ఆదిపురుష్ టీజ‌ర్

 ప్ర‌భాస్,  ఓంరౌత్ కాంబినేష‌న్లో రూపొందుతోన్న భారీ చిత్రం ‘ఆదిపురుష్‌’. ఇందులో ప్ర‌భాస్ రాముడుగా న‌టిస్తే. కృతి స‌న‌న్ సీత‌గా, సైఫ్ ఆలీఖాన్ రావ‌ణుడుగా న‌టించారు. గత కొన్ని రోజులుగా ఈ మూవీ ఫస్ట్ లుక్,  టీజర్ కోసం ప్రపంచవ్యాప్తంగా వున్న ప్రభాస్ అభిమానులు, సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురు చూశారు. ఆదిపురుష్‌ ఫస్ట్ లుక్ టీజర్ ను అయోధ్య‌లో రిలీజ్ చేశారు.

భారతీయ సినీ చరిత్రలోనే కనీ వినీ ఎరుగని రీతిలో ఈ మూవీని ఐమ్యాక్స్ 3డీ ఫార్మాట్ లలో రూపొందించారు. టీజ‌ర్ విష‌యానికి వ‌స్తే.. 1:40 నిమిషాల నిడివిగల టీజర్  ఓ విజువల్ ఫీస్ట్ గా కనిపిస్తూ ప్రేక్షకుల్ని మంత్రముగ్థుల్ని చేస్తోంది. శ్రీరాముడి లుక్ లో ప్రభాస్ పర్ ఫెక్ట్ గా ఒదిగిపోయారు. పక్షుల కిలకిలారావాలు.. అందమైన దృశంతో టీజర్ మొదలైంది.

భూమి కృంగినా.. నింగి చీలినా.. న్యాయం చేతుల్లోనే అన్యాయానికి సర్వనాశనం… వస్తున్నా.. న్యాయం రెండు పాదాలతో నీ పది తలల అన్యాయాన్నిఅణిచివేయడానికి .. ఆగమనం.. అధర్మ విధ్వంసం.. అంటూ ప్రభాస్ చెబుతున్న డైలాగ్ లు సినిమా పై అంచ‌నాలు రెట్టింపు చేశాయి. రావణాసురుడిగా సైఫ్ అలీఖాన్ ని చూపించిన తీరు సీతని ఉయ్యాలూపుతూ రాముడు కనిపించే దృశ్యాలు.. ఆదిపురుష్ ఓ విజువల్ వండర్ అని స్పష్టం చేస్తున్నాయి. ఈ టీజ‌ర్ రికార్డు వ్యూస్ తో దూసుకెళుతూ యూట్యూబ్ ని షేక్ చేస్తుంది. జ‌న‌వ‌రి 12న ఆదిపురుష్ ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల కానుంది. మ‌రి.. ఆదిపురుష్ మూవీతో ప్ర‌భాస్ చ‌రిత్ర సృష్టిస్తాడేమో చూడాలి.

Also Read : అయోధ్యలో “ఆదిపురుష్” టీజర్ విడుదల 

RELATED ARTICLES

Most Popular

న్యూస్