Tuesday, March 10, 2026
HomeTrending Newsప్రభుత్వ సలహాదారుగా ఆదిత్యనాథ్

ప్రభుత్వ సలహాదారుగా ఆదిత్యనాథ్

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సిఎస్) ఆదిత్య నాథ్ దాస్ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారుగా నియమితులయ్యారు. ఈ నెలాఖరుకు అయన సిఎస్ గా పదవీ విరమణ చేయనున్నారు. అనంతరం వెంటనే అయన ఢిల్లీలోని ఏపీ భవన్ కేంద్రంగా రాష్ట్ర ప్రభుత్వం సలహాదారుగా బాద్యతలు చేపడతారు. ఆయనకు కేబినేట్ మంత్రి హోదా కల్పిస్తున్నట్లు జీవోలో పేర్కొన్నారు. ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ (పొలిటికల్) ముత్యాల రాజు ఈ మేరకు జీవో విడుదల చేశారు.

ఏప్రిల్ 1 నుంచి ఆదిత్యనాత్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. జూన్ నెలాఖరుకే అయన పదవీకాలం ముగిసింది. అయితే కోవిడ్ రెండో దశ ఉధృతంగా ఉన్న నేపథ్యంలో అయన పదవీ కాలాన్ని మూడు నెలలు పెంచాలంటూ రాష్ట్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని కేంద్రం అంగీకరించింది. దీనితో అయన సెప్టెంబర్ ౩౦ వరకూ సిఎస్ గా కొనసాగే అవకాశం ఏర్పడింది.

సిఎస్ గా ఆదిత్యనాత్ స్థానంలో సీనియర్ ఐఏఎస్ సమీర్ శర్మను ఇప్పటికే ప్రభుత్వం ఎంపిక చేసిన సంగతి తెలిసిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular