Saturday, January 18, 2025
Homeసినిమానా మనసుకు నచ్చిందే చేస్తాను: అడివి శేష్ 

నా మనసుకు నచ్చిందే చేస్తాను: అడివి శేష్ 

మొదటి నుంచి కూడా అడివి శేష్ వైవిధ్యభరితమైన కథలను .. పాత్రలను ఎంచుకుంటూ వెళుతున్నాడు. అలా ఆయన చేసిన ‘క్షణం’ .. ‘గూఢచారి’ .. ‘ఎవరు’ .. ‘మేజర్’ వంటి సినిమాలు భారీ విజయాలను అందుకున్నాయి. దాంతో ఆయనకంటూ ఒక జోనర్ ఫిక్స్ అయింది. సాధ్యమైనంత వరకూ ఆ జోనర్లోని కథలలోనే కొత్తదనం ఉండేలా చూసుకుంటూ ఆయన ముందుకు వెళుతున్నాడు. అలా ఆయన తాజాగా చేసిన సినిమానే ‘హిట్ 2’.

నాని నిర్మించిన ఈ సినిమా థ్రిల్లర్ జోనర్లో నడుస్తుంది. మీనాక్షి చౌదరి కథానాయికగా నటించిన ఈ సినిమా, ఈ నెల 2వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో వరుస ఇంటర్వ్యూలతో శేష్ బిజీగా ఉన్నాడు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ‘క్షణం’ సినిమాకి ముందు నేను చాలా తేలికగానే కథలను ఒప్పేసుకుంటూ వెళ్లేవాడిని. ఆ తరువాత నుంచి నా సినిమాల నుంచి ప్రేక్షకులు ఏం ఆశిస్తున్నారనే విషయాన్ని గురించి ఆలోచన చేయడం మొదలుపెట్టాను. ‘

‘క్షణం’ హిట్ తరువాత నా దగ్గరికి చాలానే కథలు వచ్చాయి. కానీ వాటిలో చాలా కథలను నేను సున్నితంగా తిరస్కరించాను. ఇకపై నా మనసుకు నచ్చిన కథలనే చేయాలని డిసైడ్ అయ్యాను. నా కథలపై .. నా నిర్ణయాలపై ప్రేక్షకులకు ఒక నమ్మకం కలిగించాలి అనుకున్నాను. ఆ నమ్మకాన్ని సంపాదించుకోవడం కోసమే కష్టపడుతున్నాను. అందులో కొంతవరకూ సక్సెస్ అయ్యానని కూడా అనుకుంటున్నాను. ‘హిట్ 2’ కంటెంట్ కూడా ప్రేక్షకులకు నాపై గల నమ్మకాన్ని మరింత పెంచుతుందని ఆశిస్తున్నాను” అంటూ చెప్పుకొచ్చాడు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్