Sunday, January 19, 2025
HomeTrending Newsమహిళా సైనిక డిగ్రీ కళాశాలలో ప్రవేశాలు

మహిళా సైనిక డిగ్రీ కళాశాలలో ప్రవేశాలు

Admissions To Womens Military Degree College :

యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్‌ మండలం రాఘవాపురం శివారులోని మహిళా సైనిక డిగ్రీ కళాశాలలో 2022-23 విద్యాసంవత్సరానికి డిగ్రీ మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్‌ బాల్‌రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. వచ్చే ఏడాది జనవరి 23న ప్రవేశ పరీక్ష (టీజీయూజీసెట్‌-2022) నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. 2020-21లో ఇంటర్‌ పూర్తయిన వారు, 2021-22లో ఇంటర్‌ వార్షిక పరీక్ష రాసే విద్యార్థినులు అర్హులని, ఆసక్తి ఉన్న వారు ‌www.tswreis.ac.in,www.tgtwgurukulam. telangana.gov.in వెబ్‌సైట్ల ద్వారా ఆన్‌లైన్‌లో  జనవరి 10 లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. సైనిక కళాశాలలో బీఏ(హెచ్‌ఈపీ), బీఎస్సీ(ఎంపీసీ), బీకాం జనరల్‌ కోర్సులు అందుబాటులో ఉన్నాయన్నారు. కళాశాలలో చేరిన విద్యార్థినులకు వసతి, చదువు, సైనిక శిక్షణ ఇస్తామన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్