Wednesday, June 26, 2024
Homeసినిమాఉత్కంఠను రేపుతున్న క్రైమ్ థ్రిల్లర్ 'అదృశ్యం'

ఉత్కంఠను రేపుతున్న క్రైమ్ థ్రిల్లర్ ‘అదృశ్యం’

క్రైమ్ థ్రిల్లర్ జోనర్ కి సంబంధించిన కంటెంట్ మలయాళం నుంచి ఎక్కువగా వస్తుంటుంది. క్రైమ్ థ్రిల్లర్ కథలను అల్లడంలో ..  వాటిని తెరపై ఉత్కంఠభరితంగా ఆవిష్కరించడంలో వాళ్లకంటూ మంచి నైపుణ్యం ఉంది. అందువలన మలయాళం క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ ను ఫాలో అయ్యేవారు చాలామంది ఉంటారు. ఓటీటీ ఫ్లాట్ ఫామ్ వైపు నుంచి ఆ తరహా సినిమాలు ఏం వస్తున్నాయనే విషయంపై ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు.

అలా ఓటీటీ వైపు నుంచి ఈ వారం ప్రేక్షకులను పలకరించడానికి వచ్చిన మలయాళ సినిమాగా ‘అదృశ్యం’ కనిపిస్తుంది. ఈటీవీ విన్ లో నిన్నటి నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. అపర్ణ బాలమురళి ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సినిమాలో, హరీశ్ ఉత్తమన్ .. కళాభవన్ షాజోన్ కీలకమైన పాత్రలను పోషించారు. ఒక హత్య చేసిన వ్యక్తి అధికారంలో ఉంటే, ఆ తప్పు నుంచి తప్పించుకోవడానికి చాలా పథకాలు వేస్తాడు. అలా తప్పించుకోకుండా ఒక సాధారణ యువతి ఎలాంటి వ్యూహ రచన చేసిందనేది ఈ సినిమా.

తాను ఒక హత్య చేశాననీ .. హత్య చేసిన ప్రదేశాన్ని చూపిస్తానని చెప్పిన ఒక యువతి, పోలీస్ బలగాన్నీ .. మీడియాను అక్కడికి తీసుకుని వెళుతుంది.  తీరా అక్కడికి వెళ్లిన తరువాత తన ఎదురుగా ఉన్న సీఐని చూపించి అతనే హంతకుడు అంటుంది. అక్కడి నుంచి కథ ఎలాంటి మలుపులు తిరుగుతుందనేది ఆసక్తికరం. సుధీశ్ రామచంద్రన్ స్క్రీన్ ప్లే .. హేషమ్ అబ్దుల్ వాహబ్ సంగీతం .. రవిచంద్రన్ ఫొటోగ్రఫీ ఈ సినిమాకి మరింత బలంగా ముందుకు తీసుకుని వెళ్లాయని చెప్పచ్చు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్