Friday, March 13, 2026
Homeసినిమా'ఆర్ఆర్ఆర్ 2' గురించి అలియాకు సలహాలు..?

‘ఆర్ఆర్ఆర్ 2’ గురించి అలియాకు సలహాలు..?

రాజమౌళి తెరకెక్కించిన సంచలన చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ఎన్టీఆర్, రామ్ చరణ్‌.. వీరిద్దరి కాంబోలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమా 1200 కోట్లకు పైగా కలెక్ట్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేసింది. జపాన్ లో సైతం సినిమా సరికొత్త రికార్డులను సృష్టించింది. అయితే.. ఈ సినిమా సక్సెస్ సాధించిన తర్వాత ఎన్టీఆర్.. ఆర్ఆర్ఆర్ సినిమాకి సీక్వెల్ చేస్తే బాగుంటుందని.. స్టోరీ రెడీ చేయమని విజయేంద్రప్రసాద్ కి చెప్పారని వార్తలు వచ్చాయి. ఈ విషయాన్ని స్వయంగా విజయేంద్రప్రసాదే బయటపెట్టారు.

ఆతర్వాత ఆర్ఆర్ఆర్ 2 గురించి ఎలాంటి అప్ డేట్ లేదు. ఇటీవల మళ్లీ విజయేంద్రప్రసాదే ఆర్ఆర్ఆర్ 2 కి సంబంధించి అసలు విషయం చెప్పారు. ఇంతకీ ఏం చెప్పారంటే.. ఆర్ఆర్ఆర్ 2 ఉంటుంది కాకపోతే.. ఆ చిత్రానికి రాజమౌళి దర్శకత్వ పర్యవేక్షణ మాత్రమే చేస్తారని.. దర్శకత్వ బాధ్యతలను మాత్రం వేరే డైరెక్టర్ కి అప్పగిస్తారని చెప్పారు. ఇలా ఆర్ఆర్ఆర్ 2 గురించి న్యూస్ బయటకు రావడంతో ఆర్ఆర్ఆర్ 2 లో అలియా ఉంటుందా అనేది ఆసక్తిగా మారింది. కారణం ఏంటంటే.. ఆర్ఆర్ఆర్ లో ఆమె పాత్రకు పెద్దగా ప్రాధాన్యం లేదు. సినిమా రిలీజైన టైమ్ లో బాలీవుడ్ లో దీని పై చాలా పెద్ద చర్చ నడిచింది.

అలియా భట్ పోషించిన పాత్ర వేస్ట్ అంటూ ఉత్తరాది ప్రేక్షకులు పెదవి విరిచారు. ఒక దశలో సినిమాలో తన పాత్ర పై అలియాభట్ అసంతృప్తి వ్యక్తం చేసిందనే ఊహాగానాలు కూడా చెలరేగాయి. దాని పై వెంటనే ఆమె స్పందించింది. రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ లాంటి సినిమా చేయడం గర్వకారణం అంటూ కవర్ చేసుకుంది. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ 2 వార్తల్లోకి రావడంతో ఈసారి కాస్త ప్రాధాన్యం పెరిగేలా.. ఎక్కువ నిడివి ఉండేలా చూసుకో అంటూ అలియా భట్ కు విజ్ఞప్తి చేస్తున్నారు నెటిజన్లు. మరి.. ఆర్ఆర్ఆర్ 2 లో అలియా క్యారెక్టర్ ను ఎలా డిజైన్ చేస్తారో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular