టాలీవుడ్లోకి మరో కొత్త నిర్మాణసంస్థ ఎంట్రీ ఇచ్చింది. ప్రతాప్ పోతన్, అరవింద్ కృష్ణ, అలీ రెజా, ఊర్వశీరాయ్ ప్రధాన పాత్రల్లో అద్వితీయ మూవీస్ ప్రై.లి పతాకంపై కిరణ్ కల్లాకురి నిర్మాతగా రూపొందుతున్న చిత్రం `గ్రే`. స్పై థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి రాజ్‌మదిరాజు దర్శకత్వం వహిస్తున్నారు. ద స్పై హూ లవ్డ్ మి అనేది ఉపశీర్షిక. ఈ సినిమా హైదరాబాద్‌లోని ప్రసాద్‌ల్యాబ్‌లో పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. మూహుర్తపు సన్నివేశానికి ప్రముఖ దర్శకుడు వీఎన్. ఆదిత్య క్లాప్ ఇవ్వగా, ప్రసాద్ గ్రూప్స్ అధినేత రమేష్ ప్రసాద్ కెమెరా స్విఛ్చాన్ చేశారు. ప్రముఖ రచయిత లక్ష్మీ భూపాల్ స్క్రిప్ట్ ను అందజేశారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వివేక్ కూచిబొట్ల ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
రాజ్ మాదిరాజు మాట్లాడుతూ “రమేష్‌ప్రసాద్ గారు నాకు దేవుడిలాంటి వ్యక్తి. ప్రతిరోజూ నేను గుర్తు చేసుకునే వ్యక్తి ఆయన. దర్శకులు వీఎన్ ఆదిత్య, లక్ష్మీభూపాల్ గార్లు నాకు ఆత్మీయులు. గ్రే అనేది ఒక నెగటివ్ షేడ్ అనే కాదు. ఓ రిలేషన్ షిప్. ఓ రెవల్యూషన్. గ్రే మన లైఫ్‌లో ఉంది. మనం వెనక్కి తిరిగి చూసుకుంటే మన నీడే ఒక గ్రే. ఇదొక స్పై మూవీ. థ్రిల్లర్. నమ్మలేని అంశాలు ఉంటాయి. తెలియని ఎక్స్‌ప్రెషనే గ్రే. అదే స్క్రీన్ పై కనిపిస్తుంది. క్యాస్టింగ్ కోసం చాలా కష్టపడ్డాను. అలీ, అరవింద్, ఊర్వశీ సెట్ అయ్యారు. ఈ నెల 22 నుంచి షూటింగ్ స్టార్ట్ అవుతుంది. డిసెంబరు కల్లా అన్నీ కార్యక్రమాలను పూర్తి సంక్రాంతి సందర్భంగా ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నాం అన్నారు.