Saturday, November 23, 2024
HomeTrending Newsతెలంగాణలో క్రీడలకు అధిక ప్రాధాన్యత

తెలంగాణలో క్రీడలకు అధిక ప్రాధాన్యత

హన్మకొండ జిల్లా లోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో నూతనంగా నిర్మిస్తున్న అస్ట్రోటర్ఫ్ అథ్లెటిక్ ట్రాక్ , క్రీడా మౌలిక సదుపాయాల కల్పన పనులను రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ గార్లతో కలసి రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ పరిశీలించారు. అనంతరం సెప్టెంబర్ 15 నుండి 19 వరకు జరగనున్న నేషనల్ ఓపెన్ అథ్లెటిక్స్ ఛాంపియన్స్ షిప్ వాల్ పోస్టర్ ను మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు, ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ గార్లతో కలసి మంత్రి శ్రీనివాస్ గౌడ్  ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ…. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రంలో క్రీడా మౌలిక సదుపాయాల కల్పన కు, క్రీడాకారులకు, కోచ్ లను ప్రోత్సహిస్తున్నామన్నారు. అందులో భాగంగా రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో క్రీడా మైదానాలను నిర్మిస్తున్నారు. క్రీడల అభివృద్ధి కి దేశంలోనే అత్యుత్తమ క్రీడా పాలసీ రూపకల్పన కు క్యాబినెట్ సబ్ కమిటీని సీఎం కేసీఆర్  ప్రకటించారన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్.

ఉమ్మడి వరంగల్ జిల్లాలో మంత్రులు ఎర్రబెల్లి దయాకరరావు, సత్యవతి రాథోడ్, వినయ్ భాస్కర్ ల సూచనల మేరకు సీఎం కేసీఆర్ పర్యాటకంగా, క్రీడల అభివృద్ధి కి పెద్దపీట వేస్తున్నారన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్ . ఇటీవలే కాకతీయుల నిర్మాణ కళా సంపద రామప్ప కు యూనెస్కో గుర్తింపు రావడం తో జిల్లాలో పర్యాటకo ఎంతో అభివృద్ధి చెందుతుందన్నారు. వీటితోపాటు క్రీడల అభివృద్ధి కి కృషి చేస్తున్నామన్నారు.

ఈ కార్యక్రమంలో కూడా చైర్మన్ మర్రి యాదవ రెడ్డి, అథ్లెటిక్స్ అసోషియేషన్ జిల్లా అధ్యక్షుడు వరద రాజేశ్వర్ రావు, కార్యదర్శి సారంగఫణి, RDO వాసు చంద్ర, హాండ్ అసోసియేషన్ కు చెందిన పవన్, జుడో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కోశాధికారి కైలాష్ యాదవ్, SATS అధికారులు చంద్రారెడ్డి, దీపక్, DYSO అశోక్ కుమార్, TGO అసోసియేషన్ ఉమ్మడి వరంగల్ జిల్లా కో ఆర్డినేటర్ A. జగన్మోహన్ రావు, వరంగల్ జిల్లా అధ్యక్షులు మురళీధర్ రెడ్డి, డా. ప్రవీణ్ హన్మకొండ జిల్లా అధ్యక్షులు, TGO నాయకులు రాజేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్