Sunday, January 19, 2025
Homeసినిమా'ఏజెంట్' స్పీడు పెంచేది ఎప్పుడు?

‘ఏజెంట్’ స్పీడు పెంచేది ఎప్పుడు?

అక్కినేని అఖిల్ హీరోగా  సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా ఏజెంట్. అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఏజెంట్ ఇంకా షూటింగ్  లోనే ఉంది. ఏప్రిల్ 28న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. రిలీజ్ కి నెల రోజులు కూడా టైమ్ లేదు. కానీ.. ఎలాంటి అప్ డేట్స్ లేవు. దీంతో ఏజెంట్ ఎందుకు సైలెంట్ గా ఉన్నాడో అభిమానులకు అర్ధం కావడం లేదు. ప్రమోషన్స్ స్టార్ట్ చేయండి మహాప్రభో అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.

ఇంకా ఓ పాట, కొంత ప్యాచ్ వర్క్ బ్యాలెన్స్ ఉంది. అయితే ఇప్పటికే  రిలీజ్ చాలా ఆలస్యం కావడంతో ఎట్టి పరిస్థితిలోనూ అదే డేట్ కి రావాలని నిర్మాతలు పట్టుదలతో ఉన్నారు.  ఏజెంట్ ని పాన్ ఇండియా ఫిల్మ్ అన్నారు. ఈ  స్థాయిలో బలమైన ప్రమోషన్ కావాలి. ఈ విషయంలో ఏజెంట్ సైలెంట్ గా వున్నాడు. మొన్నటి వరకూ క్రికెట్ మ్యాచ్ లతో బిజీగా వున్నాడు అఖిల్. ఇప్పుడు విడుదల తేదీ దగ్గర పడింది. మరి ఇప్పటికైనా ఏజెంట్ లో చలనం వస్తుందని ఆశిస్తున్నారు.

అనిల్ సుంకర మాత్రం ప్రమోషన్స్ ను భారీగానే ప్లాన్ చేస్తున్నాడట. ఈ నెల ఫస్ట్ వీక్ నుంచి ప్రమోషన్స్ ప్లాన్ చేస్తున్నాడని తెలిసింది. సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ప్రమోషన్స్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. అలాగే ఆర్ఆర్ఆర్ హీరోలు ఎన్టీఆర్, చరణ్ లను రంగంలోకి దింపాలనుకుంటున్నారట. మరి.. ఏజెంట్ బాక్సాఫీస్ దగ్గర ఎంత వరకు మెప్పిస్తుందో ..?

RELATED ARTICLES

Most Popular

న్యూస్