Sunday, January 19, 2025
Homeసినిమాఏజెంట్ మూవీకి ఏమైంది..?

ఏజెంట్ మూవీకి ఏమైంది..?

అఖిల్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఏజెంట్’. ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ‘అఖిల్’, ‘హలో’, ‘మిస్టర్ మజ్ను’.. చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర మెప్పించలేదు. అయితే.. ఆతర్వాత చేసిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ మూవీ సక్సెస్ అవ్వడంతో రెట్టించిన ఉత్సాహంతో ఏజెంట్ మూవీ స్టార్ట్ చేశాడు అఖిల్. ఈ సినిమా బ్లాక్ బస్టర్ సాధించాలని పట్టుదలతో వర్క్ చేస్తున్నాడు. అయితే.. ఏ ముహుర్తాన ఈ సినిమాని స్టార్ట్ చేశారో కానీ.. రిలీజ్ వాయిదాల మీద వాయిదాలు పడుతూనే ఉంది.

లాస్ట్ ఇయర్ డిసెంబర్ లో రిలీజ్ చేయాలి అనుకున్నారు కానీ.. కరోనా కారణంగా షూటింగ్ అనుకున్నట్టుగా జరగకపోవడంతో వాయిదా పడింది. ఆతర్వాత ఆగష్టులో రిలీజ్ అని ప్రకటించారు కానీ.. రిలీజ్ కాలేదు. ఇక డిసెంబర్ లో రిలీజ్ అవుతుంది అనుకుంటే.. సంక్రాంతికి అని అనౌన్స్ చేశారు. ఇప్పుడు సంక్రాంతికి కూడా విడుదల కావడం లేదు. ఈసారి ఫిబ్రవరిలో రిలీజ్ పక్కా అనుకుంటే.. ఇప్పుడు ఫిబ్రవరిలో కూడా రిలీజ్ కావడం లేదని తెలిసింది. ఏజెంట్ మూవీ ఫిబ్రవరిలో రిలీజ్ కావడం లేదని తెలిసిన తర్వాతే  ‘సార్’ మూవీ, ‘ధమ్కీ’ మూవీని ఫిబ్రవరి 17న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారని తెలిసింది.

ఇక ఏజెంట్ 2023 సమ్మర్ కు రావడం ఉత్తమం. ఏప్రిల్ లో అనిల్ సుంకరదే ‘భోళా శంకర్’ మూవీ రిలీజ్ ఉంది కాబట్టి అదొక్కటి మినహాయించి ఇంకో తేదీకి వెళ్లాల్సి ఉంటుంది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ స్పై థ్రిల్లర్ లో అఖిల్ తో పాటు మమ్ముట్టి ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. బడ్జెట్ అఖిల్ మార్కెట్ ని మించి చాలా ఖర్చు పెట్టారు. అయితే.. సినిమా పై క్రేజ్ ఉన్నప్పటికీ.. ఇలా పదే పదే పోస్ట్ పోన్ లు చేయడం వల్ల ఉన్న హైప్ మీద ప్రభావం పడుతుంది. మరి.. సమ్మర్ కి అయినా ఏజెంట్ వస్తుందో లేదో..?

Also Read :  ‘ఏజెంట్’కి బడ్జెట్ అంతయ్యిందా? 

RELATED ARTICLES

Most Popular

న్యూస్