Saturday, January 18, 2025
Homeసినిమా ఏజెంట్ నిజంగా సంక్రాంతికి వస్తుందా..?

 ఏజెంట్ నిజంగా సంక్రాంతికి వస్తుందా..?

అఖిల్ నటించిన లేటెస్ట్ మూవీ ‘ఏజెంట్‘. ఈ చిత్రానికి డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు.మమ్ముట్టి కీలక పాత్ర పోషిస్తుండడం విశేషం. ఈ చిత్రాన్ని భారీ చిత్రాల నిర్మాత అనిల్ సుంకర అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇందులో సరసన సాక్షి వైద్య నటిస్తుంది. ఈ మూవీ ఎప్పుడో ప్రేక్షకుల ముందుకు రావాలి కానీ.. కరోనా కారణంగా షూటింగ్ అనుకున్నట్టుగా జరగకపోవడం.. ఆతర్వాత స్ర్కిప్ట్ లో మార్పులు చేర్పులు చేయడం తదితర కారణాల వలన ‘ఏజెంట్’ మూవీ బాగా ఆలస్యం అయ్యింది.

చాలా సార్లు రిలీజ్ డేట్ వాయిదా వేసిన మేకర్స్.. ఇప్పుడు ఏజెంట్ మూవీని సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. అయితే.. సంక్రాంతికి ‘ఆదిపురుష్’, ‘వాల్తేరు వీరయ్య’, ‘వీరసింహారెడ్డి’, ‘వారసుడు’ చిత్రాలు రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. వీటితో పాటు ఏజెంట్ కూడా వస్తుందని అనౌన్స్ చేశారు. అంటే.. సంక్రాంతికి 5 సినిమాలు రిలీజ్ అన్నమాట. అయితే.. ఈ సినిమాలన్నీ భారీ చిత్రాలు కాబట్టి భారీగా రిలీజ్ చేయాలి అనుకుంటారు. అందుచేత థియేటర్ల సమస్య వస్తుంది. అలాగే ఇన్ని సినిమాలు ఒకేసారి వస్తే… కలెక్షన్స్ పరంగా కూడా నిర్మాతకు నష్టమే.

అందుచేత ఈ ఐదు సినిమాల్లో ఏదో ఒక సినిమా వాయిదా పడడం ఖాయం అనే టాక్ వినిపిస్తోంది. ఏజెంట్ మూవీ షూటింగ్ ఇంకా కంప్లీట్ కాలేదు. పైగా భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీగా వస్తున్న ఈ సినిమా రెవెన్యూ పరంగా వర్కవుట్ కావాలంటే సోలోగా రావాలి. అందుచేత ఏజెంట్ మూవీ సంక్రాంతికి రాకపోవచ్చు అనే టాక్ బలంగా వినిపిస్తోంది. మరో వైపు అన్నపూర్ణ స్టూడియోస్, సురేష్ ప్రొడక్షన్స్ ఈ సినిమాని డిస్ట్రిబ్యూట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ నేపధ్యంలో ఏజెంట్ సంక్రాంతికి వస్తుందా..?  వాయిదా పడుతుందా..? అనేది ఆసక్తిగా మారింది. మరి.. ఏజెంట్ ఈసారైనా చెప్పినట్టుగా సంక్రాంతికి వస్తాడో లేదో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్