Saturday, January 18, 2025
Homeసినిమా సంక్రాంతి బ‌రిలో ఏజెంట్.?

 సంక్రాంతి బ‌రిలో ఏజెంట్.?

అఖిల్ న‌టిస్తున్న భారీ చిత్రం ఏజెంట్. ఈ చిత్రానికి డైరెక్ట‌ర్ సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శక‌త్వం వ‌హిస్తున్నారు. ఇందులో స‌ర‌స‌న సాక్షి వైద్య న‌టిస్తుంది. కీల‌క పాత్ర‌లో  మ‌మ్ముట్టి న‌టిస్తుండ‌డంతో ఈ మూవీ పై మ‌రింత క్రేజ్ ఏర్ప‌డింది. ఆమ‌ధ్య రిలీజ్ చేసిన టీజ‌ర్ కు ట్రెమండ‌స్ రెస్పాన్స్ వ‌చ్చింది. దీంతో అక్కినేని అభిమానులు ఎప్పుడెప్పుడు ‘ఏజెంట్’ మూవీ రిలీజ్ అవుతుందా అని ఎదురు చూస్తున్నారు.

ఏజెంట్ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందో అఫిషియ‌ల్ గా ప్ర‌క‌టించ‌లేదు కానీ.. సంక్రాంతి బ‌రిలో దిగుతుంద‌ని టాక్ బ‌లంగా వినిపిస్తోంది. ఈ సంక్రాంతికి బాక్సాఫీసు దగ్గర పోటీ మామూలుగా లేదు. పెద్ద సినిమాలన్నీ పండగనే టార్గెట్‌ చేశాయి. ‘వాల్తేరు వీరయ్య’ ‘ఆదిపురుష్’ మూవీ కూడా సంక్రాంతి బరిలో దిగబోతోంది. ‘వారసుడుగా’ రాబోతున్న విజయ్‌ కూడా సంక్రాంతికి రావాలని ఫిక్స్‌ అయ్యాడట. బాల‌య్య సినిమా కూడా పండ‌గ‌కే అంటున్నారు.

వీటితో పాటుగా ఇప్పుడు అఖిల్‌ సినిమా ఏజెంట్‌ సైతం పండగ  పోటీలో ఉంటుందని తెలుస్తోంది. అఖిల్‌ కెరీర్‌లోనే అత్యధిక బడ్జెట్‌తో రూపొందిస్తున్న చిత్రమిది. పాన్ ఇండియా మూవీగా ఏజెంట్ రూపొందుతోంది. భారీ బ‌డ్జెట్ తో రూపొందిన భారీ వ‌సూళ్లు రాబ‌ట్టాలంటే. మంచి సీజన్‌లో విడుదల కావాలి. అందుకే సంక్రాంతి పై దృష్టి సారించినట్టు సమాచారం. త్వ‌ర‌లోనే ఏజెంట్ మూవీ రిలీజ్ డేట్ ను అఫిషియ‌ల్ గా అనౌన్స్ చేయ‌నున్నారు. మ‌రి.. ఈ ఆస‌క్తిక‌ర పోటీలో ఎవ‌రు విన్న‌ర్ గా నిలుస్తారో చూడాలి.

Also Read : అఖిల్.. బాలీవుడ్ మూవీని నాగ్ సెట్ చేశారా..? 

RELATED ARTICLES

Most Popular

న్యూస్