Wednesday, March 18, 2026
Homeసినిమా'అగ్నినక్షత్రం' గ్లింప్స్ కి అనూహ్య స్పందన

‘అగ్నినక్షత్రం’ గ్లింప్స్ కి అనూహ్య స్పందన

మోహన్‌బాబు, మంచు లక్ష్మీ ప్రసన్న కలిసి నటించిన తొలి చిత్రం ‘అగ్ని నక్షత్రం’. ఈ మూవీకి వంశీక్షష్ణ మళ్ల దర్శకత్వం వహంచారు. లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్‌, మంచు ఎంటర్‌టైన్స్‌మెంట్స్‌ బ్యానర్ల పై మోహన్‌ బాబు, లక్ష్మీ నిర్మించిన ఈ సినిమా గ్లింప్స్ వాలంటైన్స్ డే సందర్బంగా నటుడు దగ్గుపాటి రానా రిలీజ్ చేశారు. ఈ గ్లింప్స్ కి ప్రేక్షకులు నుంచి మంచి స్పందన వస్తుంది. త్వరలో ఈ చిత్రం  విడుదల తేదిని ప్రకటించనున్నారు.

ప్రముఖ మలయాళ నటుడు సిద్ధిక్, యువ హీరో విశ్వంత్, చైత్ర శుక్లతో పాటు భారీ తారాగణంతో ఈ సినిమా తెరకెక్కుతోంది. వంశీ కృష్ణ మళ్ల దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రానికి అచ్చు రాజమణి సంగీతం సమకూరుస్తున్నారు. గోకుల్ భారతి సినిమాటోగ్రఫీ అందించారు. మధు రెడ్డి ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. గ్లింప్స్ ఇంట్రస్టింగ్ గా ఉండడంతో సినిమా పై మరింత ఆసక్తి ఏర్పడింది. మరి.. సరైన సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న మంచు వారికి అగ్ని నక్షత్రం మంచి విజయాన్ని అందిస్తుందేమో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular