Saturday, January 18, 2025
HomeTrending Newsసేర్ప్ తో ఫ్లిప్ కార్ట్ ఒప్పందం

సేర్ప్ తో ఫ్లిప్ కార్ట్ ఒప్పందం

ఒక మల్టీ నేషనల్ కంపెనీ, స్వయం సహాయక సంఘాలతో ఒప్పందం చేసుకోవడం దేశంలోనే మొదటి ఒప్పందమని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఈ ఏడాది 500 కోట్ల వ్యాపార లక్ష్యంతో ఈ ఒప్పందం కుదిరిందన్నారు. రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ Serp – ప్రముఖ ఆన్లైన్ వ్యాపార సంస్థ Flipkart మధ్య హైదరాబాద్  మ‌ర్రి చెన్నారెడ్డి మావ‌న వ‌న‌రుల అభివృద్ధి కేంద్రంలో జరిగిన పరస్పర వ్యాపార ఒప్పంద కార్యక్రమాన్ని జ్యోతిని వెలిగించి ప్రారంభించిన పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు . ఈ సందభంగా మాట్లాడుతూ ఫ్లిప్ కార్డ్ కి ఒక క్రెడిట్ ఉంది. వాళ్ళ తో ప్రయాణం తప్పకుండా మన మ‌హిళా సంఘాల‌కు లాభం చేకూరుతుందన్నారు.

సాగు, వ్య‌వ‌సాయోత్ప‌త్తులు, ఇత‌ర ఉత్ప‌త్తుల రంగంలోకి మ‌హిళ‌లు వ‌చ్చారని, మహిళా సంఘాలు ముందుకు రావడం వల్ల దళారుల వ్యవస్థకు బ్రేక్ పడిందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ అన్నారు. మన రాష్ట్రంలో ఇంకా అనేక పంటలు పండుతున్నాయని, వాటికి కూడా మార్కెటింగ్ జరిగే విధంగా చూడాలన్నారు. బ్యాంకులు ఎలాంటి గ్యారంటీ లేకుండానే మ‌హిళ‌ల‌కు రుణాలు ఇవ్వ‌డానికి ముందుకు వ‌స్తున్నాయని, గ‌త ఏడాది 15వేల కోట్ల రుణాలు ఇచ్చామని వెల్లడించారు. ఈ ఏడాది 18వేల కోట్లు ఇవ్వాల‌ని నిర్ణ‌యించామని లోన్లు తీసుకొని ఇంటి అవసరాలు తీర్చుకోవడం కాదు, వ్యాపారాలు చేయడానికి ప్రయత్నించండని మంత్రి సూచించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్