Saturday, November 23, 2024
HomeTrending Newsరైతు కోసమే సలహా మండళ్ళు

రైతు కోసమే సలహా మండళ్ళు

వ్యవసాయ సేవలను రైతులకు మరింత చేరువగా తీసుకెళ్లేందుకే వ్యవసాయ సలహా మండళ్లను ఏర్పాటు  చేశామని రాష్ట్ర మంత్రి కురసాల కన్నబాబు స్పష్టం చేశారు. రైతన్నకు అవసరమైన సలహాలు, సూచనలను మరింత మెరుగ్గా అందించేందుకే సీఎం జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారని వెల్లడించారు.  రాష్ట్రంలోని అన్ని జిల్లాల వ్యవసాయ సలహా మండళ్ల  చైర్మన్లతో ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి అవగాహన సదస్సులో కన్నబాబు పాల్గొన్నారు.  వ్యవసాయ సలహా మండళ్ల ఆవిర్భావం, ఉద్దేశ్యాలు, బాధ్యతలపై ఉన్నతాధికారులు అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా కన్నబాబు మాట్లాడిన ముఖ్యాంశాలు

  • సీఎం ఆదేశాల మేరకు వ్యవసాయ మండళ్లను  అన్ని వ్యవసాయ అంశాల్లోనూ భాగస్వాములను చేస్తున్నాం
  • రైతుకు సముచిత గౌరవం ఇస్తూ ఒక రైతునే చైర్మన్ గా నియమించాలని సీఎం ఆదేశించారు
  • సుమారు లక్ష మందికిపైగా అనుభవం వున్న రైతులు ఈ మండళ్ల ద్వారా అటు రైతాంగానికి ఇటు ప్రభుత్వానికి విలువైన సలహాలు ఇస్తారు
  • వ్యవసాయ, ఉద్యాన, సహకార, పట్టుసాగు, చేపలు రొయ్యల పెంపకం, సహకారం, తదితర అన్ని అంశాల్లో ఈ  మండళ్లు తమ సూచనలను అందిస్తాయి
  • దేశంలోని ఏ రాష్ట్రంలోని అమలు చేయని వ్యవసాయ, సంక్షేమ పథకాలను మనం అమలు చేస్తున్నాం
  • కోవిడ్ వంటి విపత్కర పరిస్థితుల్లో కూడా మన సిఎం జగన్ దిగ్విజయంగా పథకాలు అమలు చేస్తున్నారు
  • సాగు చేసే ప్రతి పంట ఈ క్రాప్ లో రిజిస్టర్ చేయించాలి.ఇది రైతుతో పాటూ మనందరి ప్రధాన బాధ్యత
  • అందుకు తగిన సదుపాయాలను ఆర్బీకే ల్లో కల్పించాం
  • పంటల ప్రణాళిక, డిమాండ్ మేరకు ఉత్పత్తి, పంటల మార్పు, రైతులకు ఆర్బీకే లో అందుతున్న సేవలపై అవగాహన కల్పించాలి
  • మార్కెట్ ఇంటలిజెన్స్, వాతావరణ పరిస్థితులు, FPO ల సుస్థిరత తదితర అంశాలపై సలహాలు ఇస్తూ రైతుల్ని చైతన్యపరచాలి
  • బోర్ల కింద వరి పండించకుండా రైతులకు అవగాహన కల్పించాలి
  • ఈ  క్రాప్ మరియు సీఎంయాప్ లను మరింత సరళీకృతం చేసి రైతులకు సులువుగా ఉండేలా చేస్తాం
RELATED ARTICLES

Most Popular

న్యూస్