Friday, March 20, 2026
Homeసినిమాతేజ, అభిరామ్ 'అహింస' రిలీజ్ డేట్ ఫిక్స్

తేజ, అభిరామ్ ‘అహింస’ రిలీజ్ డేట్ ఫిక్స్

వెండితెర పై వైవిధ్యమైన ప్రేమకథలని ఆవిష్కరించి ఘన విజయాలని సాధించిన క్రియేటివ్ జీనియస్ తేజ తెరకెక్కించిన తాజా చిత్రం  ‘అహింస ‘. ఈ మూవీతో అభిరామ్ అరంగేట్రం చేస్తున్నారు. యూత్ ఫుల్ లవ్, యాక్షన్ ఎంటర్‌టైనర్ గా ఈ సినిమా రూపొందింది. ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్‌ పై పి కిరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ‘అహింస’ ఫస్ట్, టీజర్‌ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.

అలాగే ఆర్పీ పట్నాయక్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలోని ‘నీతోనే నీతోనే’, ‘కమ్మగుంటదే’ పాటలు చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి. తాజాగా మేకర్స్ ‘అహింస’ రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు. అహింస ఏప్రిల్ 7న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ లో గ్రాండ్ గా విడుదలౌతుంది. అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో సినిమాకు సంబధించిన డిఫరెంట్ యాస్పెక్ట్స్  కనిపిస్తున్నాయి. తదుపరి ప్రమోషన్‌లను మేకర్స్ త్వరలో ప్రారంభిస్తారు. ఈ చిత్రానికి సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫర్, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్‌ కాగ, అనిల్ అచ్చుగట్ల డైలాగ్స్ అందించారు. మరి.. అభిరామ్ తొలి ప్రయత్నంలో ఎంత వరకు మెప్పిస్తాడో చూడాలి.

Also Read : ‘అహింస’ థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేసిన రామ్ చరణ్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular