Monday, February 24, 2025
HomeTrending Newsవరద సాయంపై కేటిఅర్ కు లేఖ

వరద సాయంపై కేటిఅర్ కు లేఖ

జీహెచ్ఎంసీ ఎన్నికల ముందు వాగ్ధానం చేసిన వరద సాయాన్ని యుద్ధప్రాతిపాదికన విడుదల చేయాలని కోరుతూ మంత్రి కేటీఆర్ కు ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ రాశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత ఇస్తామన్న వరద సాయం ఏ కారణం చేత ఇంకా ఇవ్వడం లేదని దాసోజు శ్రవణ్ ప్రశ్నించారు. గత ఏడాది అక్టోబర్ నుంచి దాదాపు 5 లక్షమంది వరద బాదితులు నష్ట పరిహారం కోసం ఎదురు చూస్తున్నారు. నష్ట పరిహారం ఎప్పుడు చెల్లిస్తారో కేటీఆర్ చెప్పాలని దాసోజుశ్రవణ్ డిమాండ్ చేశారు. గత కొద్ది రోజులు పడుతున్న వర్షాల కారణంగా సుమారు 200 కోట్ల రూపాయిల నష్టం జరిగినట్టు ప్రాధమిక అంచనా. ఈ నష్ట పరిహారాన్ని ఎప్పుడు చెల్లిస్తారని దాసోజు శ్రవణ్ లేఖలో పేర్కొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్