Friday, March 13, 2026
HomeసినిమాAishwarya Rai Bachchan: ఐశ్వర్య రాయ్ విలనిజంపైనే అందరి దృష్టి!

Aishwarya Rai Bachchan: ఐశ్వర్య రాయ్ విలనిజంపైనే అందరి దృష్టి!

మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ‘పొన్నియిన్ సెల్వన్ 1’ ను ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేశారు. లైకా ప్రొడక్షన్స్ వారు ఖర్చుకు ఎంతమాత్రం వెనకాడకుండా నిర్మించిన సినిమా ఇది. స్టార్  హీరోలు .. స్టార్ హీరోయిన్లు ఈ సినిమాలో ప్రధానమైన పాత్రలను పోషించారు. టైటిల్ జయంరవి పాత్రకి సంబంధించినదే అయినా, విక్రమ్ – ఐశ్వర్యరాయ్ పాత్రలకి గల ప్రాధాన్యత ఎక్కువ. అయితే ఫస్టు పార్టులో ఈ రెండు పాత్రలు కలుసుకునే నిడివి చాలా తక్కువ ఉంది.

ఇక ఇప్పుడు ‘పొన్నియిన్ సెల్వన్ 2’ ను ఈ నెల 28వ తేదీన విడుదల చేస్తున్నారు. ఫస్టు పార్టు తమిళనాడులో ఆదరణ పొందినంతగా మిగతా భాషల్లో కనెక్ట్ కాలేకపోయింది. కానీ ఈ సారి మాత్రం మిగతా భాషలవారిని ఆకట్టుకునే అంశాలు పుష్కలంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. విక్రమ్ – ఐశ్వర్య రాయ్  కాంబినేషన్ సీన్స్ ఈ పార్టులో ఎక్కువగా కనిపించనున్నాయి. అలాగే విక్రమ్ వీరత్వం  .. ఐశ్వర్య రాయ్ విలనిజం ఎక్కువ స్థానాన్ని ఆక్రమించనున్నాయి.

అలాగే త్రిష – కార్తి జంటకి సంబంధించిన ట్రాక్ నిడివి ఎక్కువగా ఉండనుంది. ఇక జయం రవి వైపు నుంచి కూడా సున్నితమైన లవ్ ట్రాక్ నడవనుంది. పోరాట సన్నివేశాలను గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పనిలేదు. అయితే ఫస్టు పార్టులోనే పాత్రల సంఖ్య ఎక్కువైపోయి, వాటిని రిజిస్టర్ చేసుకోవడనికి ఆడియన్స్ కి కొంతసమయం పట్టింది. సెకండ్ పార్టులో మరికొన్ని కొత్త పాత్రలు వచ్చి చేరినట్ట్టుగా తెలుస్తోంది. పాత్రల విషయంలో కన్ఫ్యూజన్ లేకపోతే, ఈ సినిమా కనెక్ట్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular