Saturday, January 18, 2025
Homeసినిమావెంకీ ప్రాజెక్టుపైనే దృష్టిపెట్టిన ఐశ్వర్య రాజేశ్! 

వెంకీ ప్రాజెక్టుపైనే దృష్టిపెట్టిన ఐశ్వర్య రాజేశ్! 

తమిళంలో ఐశ్వర్య రాజేశ్ కి మంచి క్రేజ్ ఉంది. ఒక వైపున కాస్త పేరున్న హీరోల జోడీగా కనిపిస్తూనే, మరో వైపున నాయిక ప్రధానమైన పాత్రలను చేస్తూ వెళుతోంది. ఆరంభంలో తమిళ .. మలయాళ సినిమాలను మాత్రమే చేస్తూ మంచి ఇమేజ్ ను సొంతం చేసుకున్న ఐశ్వర్య రాజేశ్, ఆ తరువాత తెలుగు .. కన్నడ సినిమాలపై కూడా దృష్టి పెట్టింది. తెలుగులో ఆమె చేసిన సినిమాలు గొప్పగా ఆడకపోయినా, ఓటీటీలో వచ్చిన అనువాదాలు ద్వారా ఆమె ఇక్కడి ప్రేక్షకులకు బాగా చేరువైంది.

తమిళంలో ఆమె చేసిన ‘ఫర్హానా’ .. ‘తీరా కాదల్’ సినిమాలు ఓటీటీలో అందుబాటులో ఉన్నాయి. ఈ సినిమాల తరువాత చాలామంది ఆమె అభిమానులుగా మారిపోయారు. అలాంటి ఐశ్వర్య రాజేశ్ వరుస సినిమాలతో బిజీగా ఉంది. ప్రస్తుతం ఆమె చేతిలో తమిళ .. మలయాళ .. కన్నడ సినిమాలు ఉన్నాయి. ఇక వెంకటేశ్ సరసన కథానాయికగా కూడా ఆమె ఛాన్స్ దక్కించుకుంది. వెంకటేశ్ హీరోగా అనిల్ రావిపూడి ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఆమె వెంకటేశ్ భార్యగా కనిపించనుంది.

ఈ సినిమాలో వెంకటేశ్ ఒక రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నారు. ఆయన పాత్రను అనిల్ రావిపూడి డిఫరెంట్ గా డిజైన్ చేశారని అంటున్నారు. అనిల్ స్టైల్లోనే ఈ సినిమా యాక్షన్ కామెడీ జోనర్లో ఉంటుంది. మరో కథానాయికగా మీనాక్షి చౌదరిని తీసుకున్నారు. తెలుగులో ఐశ్వర్య రాజేశ్ కి ఇది పెద్ద సినిమాగా చెప్పచ్చు. భారీ బడ్జెట్ లో దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం సెట్స్ పై ఉంది. వచ్చేనెల నుంచి వెంకటేశ్ షూటింగుకి హాజరుకానున్నారు. భీమ్స్ సంగీతాన్ని సమకూర్చుతున్న ఈ సినిమాను, సంక్రాంతికి రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్