Sunday, January 19, 2025
Homeసినిమాఅజయ్ భూపతి ‘మంగళవారం’ అప్ డేట్ ఏంటి..?

అజయ్ భూపతి ‘మంగళవారం’ అప్ డేట్ ఏంటి..?

ఆర్ఎక్స్ 100 సినిమాతో బ్లాక్ బస్టర్ సాధించిన అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్న తాజా సినిమా ‘మంగళవారం’. అజయ్ భూపతి దర్శకత్వంలో మరోసారి పాయల్ రాజ్‌పుత్ నటిస్తున్న చిత్రమిది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రం రూపొందుతోంది. ముద్ర మీడియా వర్క్స్ పతాకంపై స్వాతి రెడ్డి గునుపాటి, సురేష్ వర్మ .ఎం నిర్మిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ పూర్తి అయ్యింది.

నిర్మాత స్వాతి రెడ్డి గునుపాటి మాట్లాడుతూ… కంటెంట్, క్వాలిటీ పరంగా కాంప్రమైజ్ కాకుండా నిర్మిస్తున్న సినిమా ‘మంగళవారం’. జూన్ 12తో షూటింగ్ కంప్లీట్ చేశాం. సినిమా పూర్తి చేయడానికి మొత్తం 99 రోజులు పట్టింది. అందులో కేవలం 48 రోజులు పగటి పూట షూటింగ్ చేశాం. 51 రోజులు రాత్రి వేళల్లో చిత్రీకరణ చేశాం. ఇప్పటి వరకు ఇండియన్ స్క్రీన్ మీద రానటువంటి జానర్ కథతో అజయ్ భూపతి అద్భుతమైన సినిమా తీస్తున్నారు. సాంకేతికంగా ఉన్నత నిర్మాణ విలువలతో రూపొందిస్తున్న చిత్రమిది. త్వరలో టీజర్, ట్రైలర్ విడుదల తేదీలు, ఇతర వివరాలు వెల్లడిస్తాం. కొన్ని రోజుల క్రితం విడుదల చేసిన పాయల్ ఫస్ట్ లుక్‌కు మంచి రెస్పాన్స్ లభించడం సంతోషంగా ఉంది” అని చెప్పారు.

చిత్ర దర్శకుడు అజయ్ భూపతి మాట్లాడుతూ… గ్రామీణ నేపథ్యంలో నేటివిటీతో కూడిన కథతో తీస్తున్న చిత్రమిది. డిఫరెంట్ యాక్షన్ థ్రిల్లర్. థియేటర్లలో కొత్త ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. సినిమాలో మొత్తం 30 పాత్రలు ఉన్నాయి. ప్రతి పాత్రకు కథలో ప్రాముఖ్యం ఉంటుంది. నిర్మాణాంతర కార్యక్రమాలు త్వరలో ప్రారంభిస్తాం. ‘కాంతార’ ఫేమ్ అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నారు. నేపథ్య సంగీతం సినిమా హైలైట్స్‌లో ఒకటి అవుతుంది” అని చెప్పారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్