Saturday, January 18, 2025
Homeసినిమాటెన్షన్ పెట్టేసే 'సైతాన్'  

టెన్షన్ పెట్టేసే ‘సైతాన్’  

బాలీవుడ్ లో మార్చి 8వ తేదీన వచ్చిన ‘సైతాన్’ .. అక్కడ ఒక రేంజ్ లో దూసుకుపోయింది. 65 కోట్ల రూపాయల బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా, చాలా వేగంగా 200 కోట్ల మార్క్ ను టచ్ చేసింది. అజయ్ దేవగణ్ – జ్యోతిక – మాధవన్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమాకి, వికాస్ బహ్ల్ దర్శకత్వం వహించాడు. సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్ జోనర్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. థియేటర్స్ నుంచి మంచి రెస్పాన్స్ తెచ్చుకున్న ఈ సినిమా, ఇప్పుడు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పైకి వచ్చేసింది. టెన్షన్ పెట్టేసే ‘సైతాన్’.

కథలోకి వెళితే .. కబీర్ తన భార్య .. ఇద్దరు పిల్లలతో కలిసి ఫామ్ హౌస్ కి బయల్దేరతాడు. మార్గమధ్యంలో ఒక హోటల్ దగ్గర వారికి వనరాజ్ పరిచయమవుతాడు. కబీర్ ఇచ్చిన చనువు కారణంగా అతను ఫామ్ హౌస్ కి కూడా వెళతాడు. అతను అతీంద్రియ శక్తులను పొందడం కోసం ప్రయత్నాలు చేస్తున్నాడనే విషయం తెలియని కబీర్, ఓ ఫ్రెండ్ గానే అతణ్ణి ట్రీట్ చేస్తాడు. అయితే కబీర్ కూతురు జాన్వీపై వనరాజ్ వశీకరణ విద్యను ప్రయోగిస్తాడు. దాంతో ఆ అమ్మాయి అతను ఏం చెబితే అది చేయడం మొదలుపెడుతుంది.

ఒకానొక సందర్భంలో తమ్ముడు ధృవ్ ను చంపేయమని జాన్వీని వనరాజ్ ఆదేశిస్తాడు. దాంతో అందుకు ఆమె సిద్ధపడుతుంది. ఒక వైపున కూతురును కాపాడుకోవాలి .. ఆమె బారి నుంచి కొడుకును రక్షించుకో వలసిన పరిస్థితి వనరాజ్ దంపతులకు ఏర్పడుతుంది. అప్పుడు ఆ దంపతులు ఏం చేస్తారు? చివరికి ఏమౌతుంది? అనే ఆసక్తికరమైన అంశాలతో ఈ కథ నడుస్తుంది. ప్రస్తుతం హిందీలోనే స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా, త్వరలో తెలుగులోను అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్