Thursday, March 12, 2026
Homeసినిమాఓవ‌ర్ సీస్ లో 1 మిలియ‌న్ క్రాస్ చేసిన అఖండ‌

ఓవ‌ర్ సీస్ లో 1 మిలియ‌న్ క్రాస్ చేసిన అఖండ‌

Akhanda in USA:
నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ, మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీను కాంబినేష‌న్లో రూపొందిన సంచ‌ల‌న చిత్రం ‘అఖండ‌’. వీరిద్ద‌రి కాంబినేష‌న్లో రూపొందిన ‘సింహా’, ‘లెజెండ్’ చిత్రాల త‌ర్వాత చేసిన హ్యాట్రిక్ సినిమా కావ‌డంతో అటు అభిమానుల్లోను ఇటు ఇండ‌స్ట్రీలోను భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. ఆ అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్టుగానే ఈ సినిమా అద్భుత‌మైన విజ‌యం సొంతం చేసుకుంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవ‌ర్ సీస్ లో సైతం రికార్డ్ క‌లెక్ష‌న్స్ వ‌సూలు చేస్తూ దూసుకెళుతుంది.

అఖండ ఓవ‌ర్ సీస్ లో ప్రీమియ‌ర్ అండ్ ఫ‌స్డ్ డే క‌లెక్ష‌న్స్ తోనే సంచ‌ల‌నం సృష్టించింది. ఈ సినిమా యు.ఎస్ లో 1 మిలియ‌న్ డాలర్ మార్క్ క్రాస్ చేసింది. క‌రోనా వ‌ల‌న‌ యు.ఎస్. లో సినిమాల‌కు ఆద‌ర‌ణ బాగా త‌గ్గింది. ఇలాంటి టైమ్ లో విడుదలవుతోన్న భారీ సినిమాలను అక్కడి ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారో అనే అనుమానాలుండేవి. అయితే  సెకండ్ వేవ్ త‌ర్వాత రిలీజైన జాతిర‌త్నాలు, ల‌వ్ స్టోరీ సినిమాల‌కు బాగానే ఆద‌ర‌ణ ల‌భించింది.
ఇప్పుడు భారీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ ‘అఖండ’ కూడా భారీ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్ట‌డం విశేషం. వ‌ర‌ల్డ్ వైడ్ గా 100 కోట్ల గ్రాస్ క‌లెక్ట్ చేసి, బాల‌య్య సినిమాల్లో అత్య‌ధిక క‌లెక్ష‌న్స్ సాధించిన చిత్రంగా స‌రికొత్త రికార్డ్ క్రియేట్ చేయ‌డం విశేషం.

Also Read : అఖండ పరిశ్రమ విజయం : నందమూరి బాలకృష్ణ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular