Sunday, January 19, 2025
Homeసినిమారేపు ‘అఖండ’ ఫస్ట్ సింగిల్

రేపు ‘అఖండ’ ఫస్ట్ సింగిల్

నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో రూపొందుతోన్న భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ ‘అఖండ’. బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ నటిస్తోంది. ‘సింహ’, ‘లెజెండ్’ చిత్రాల తర్వాత బాలయ్య, బోయపాటి కలిసి చేస్తున్న సినిమా కావడంతో అటు అభిమానుల్లోను, ఇటు ఇండస్ట్రీలోను అఖండ సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే విడుదలైన రెండు టీజర్స్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి. దీంతో నందమూరి అభిమానులు అఖండ సినిమా రిలీజ్ ఎప్పుడా అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

‘అఖండ’ అప్ డేట్స్ కోసం ఎదురుచూస్తోన్న బాలయ్య అభిమానుల కోసం మేకర్స్ ఇంట్రస్టింగ్ అప్ డేట్ ఇచ్చారు. అది ఏంటంటే.. ఈ సినిమా ఫస్ట్ సింగిల్ సెప్టెంబర్ 18 సాయంత్రం 5 గంటల 33 నిమిషాలకు రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. దీనితో పాటు బాలయ్య, ప్రగ్యా జైస్వాల్ ఉన్న ఒక ప్లెజెంట్ పోస్టర్ ని కూడా రిలీజ్ చేశారు. ఈ చిత్రానికి సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్. థమన్ సంగీతం అందిస్తున్నారు. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై యువ నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. మరి.. అఖండ రిలీజ్ డేట్ ను కూడా త్వరలోనే అనౌన్స్ చేస్తారేమో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్