Thursday, March 19, 2026
Homeసినిమా‘అఖండ’కు  బాల‌య్య కెరీర్లోనే హ‌య్య‌స్ట్ క‌లెక్ష‌న్స్

‘అఖండ’కు  బాల‌య్య కెరీర్లోనే హ‌య్య‌స్ట్ క‌లెక్ష‌న్స్

Biggest hit in balayya career:
నందమూరి న‌టసింహం బాలకృష్ణ, ఊర మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీను కాంబినేష‌న్లో రూపొందిన భారీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ అఖండ‌. సింహ‌, లెజెండ్ చిత్రాల త‌ర్వాత బాల‌య్య‌, బోయ‌పాటి క‌లిసి సినిమా చేయ‌డంతో అటు అభిమానుల్లోను, ఇటు ఇండ‌స్ట్రీలోను భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. ఆ.. అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్టే అఖండ అద్భుత‌మైన విజ‌యం సాధించింది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా.. ఓవ‌ర్ సీస్ లో సైతం రికార్డు క‌లెక్ష‌న్స్ వ‌సూలు చేయ‌డం విశేషం.

ఈ సంచ‌ల‌న చిత్రం అఖండ మూడవ వారంలోకి ప్రవేశించింది. బాక్సాఫీస్ ద‌గ్గ‌ర పోటీగా స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప’ సినిమా రిలీజైంది. అయిన‌ప్ప‌టికీ.. 18వ రోజు కూడా అఖండ చిత్రం అద్భుతమైన‌ వసూళ్లను సాధించిందని ట్రేడ్ రిపోర్ట్ చెబుతోంది. ఇప్పటికి 76 కోట్ల వరల్డ్ వైడ్ షేర్ ని అఖండ వసూలు చేసింది. అలాగే 100 కోట్లు పైగా గ్రాస్ మార్క్ ను అందుకుంది. ఇది బాలకృష్ణ కెరీర్లోనే హ‌య్య‌స్ట్ షేర్ అందించిన చిత్రంగా నిలిచింది.

వచ్చే వారాంతంలో క్రిస్మస్ హాలిడే వీకెండ్ తో ఈ సినిమా మరింతగా వసూళ్లను రాబట్టే అవకాశం ఉంది. మ‌రి.. ఫుల్ ర‌న్ లో అఖండ ఇంకెంత క‌లెక్ట్ చేస్తుందో..? ఎలాంటి రికార్డ్ సాధిస్తుందో చూడాలి.

Also Read : దుర్గమ్మను దర్శించుకున్న బాలకృష్ణ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular