Tuesday, March 10, 2026
Homeసినిమాదసరా కు ముందే బాలయ్య ‘అఖండ’?

దసరా కు ముందే బాలయ్య ‘అఖండ’?

నందమూరి నటసింహం బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం అఖండ. ఈ చిత్రానికి మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్నారు. సింహా, లెజెండ్ చిత్రాల తర్వాత బాలయ్య, బోయపాటి కాంబినేషన్ లో రూపొందుతోన్న సినిమా కావడంతో అఖండ సినిమా పై అటు అభిమానుల్లోను, ఇటు ఇండస్ట్రీలోను భారీ అంచనాలు ఉన్నాయి. నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడు అఖండ మూవీ విడుదల అవుతుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ మూవీ రిలీజ్ విషయానికి వస్తే.. కీ.శే నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా మే 28న అఖండ సినిమాను భారీ స్ధాయిలో విడుదల చేయాలి అనుకున్నారు కానీ.. కరోనా సెకండ్ వేవ్ కారణం వాయిదా పడింది.

ఇప్పుడు లాక్ డౌన్ ఎత్తేయడంతో త్వరలోనే షూటింగ్ స్టార్ట్ చేసి మిగిలిన షూటింగ్ ను కంప్లీట్ చేయడానికి బోయపాటి టీమ్ ప్లాన్ చేస్తుంది. రెండు నెలల్లో ఈ షూటింగ్ పూర్తి చేయనున్నారని తెలిసింది. అయితే.. ఈ భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ అఖండను దసరాకి విడుదల చేయనున్నారు అని వార్తలు వచ్చాయి. దీంతో అభిమానులు అఖండ మూవీ దసరాకి రానుందని ఫిక్స్ అయ్యారు. అయితే.. తాజా వార్త ఏంటంటే.. దసరాకి కాకుండా వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 10న అఖండ మూవీని విడుదల చేయనున్నారని టాక్ వినిపిస్తోంది. మరి.. త్వరలోనే అఖండ విడుదల తేదీని అఫిషియల్ గా అనౌన్స్ చేస్తారేమో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular