Release Date: అక్కినేని అఖిల్, స్టైలీష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి కాంబినేషన్లో రూపొందుతోన్న భారీ చిత్రం ఏజెంట్. ఇందులో మలయాళ స్టార్ మమ్ముట్టి కీలక పాత్ర పోషిస్తుండడం విశేషం. భారీ చిత్రాల నిర్మాత అనిల్ సుంకర ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీని ప్రకటించినప్పటి నుంచి అటు అభిమానుల్లోనూ ఇటు ఇండస్ట్రీలోనూ ఏజెంట్ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ మూవీ అప్ డేట్స్ కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ ఏంటంటే.. టీజర్ అండ్ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యిందట.
ఇంతకీ టీజర్ రిలీజ్ ఎప్పుడంటే… జులై 9న ఏజెంట్ టీజర్ రిలీజ్ చేయనున్నారని సమాచారం. ప్రస్తుతం నిర్మాత అనిల్ సుంకర యు.ఎస్ లో ఉన్నారు. ఆయన వచ్చిన తర్వాత ఏజెంట్ టీజర్ రిలీజ్ డేట్ ను అఫిషియల్ గా అనౌన్స్ చేయనున్నారని తెలిసింది. టీజర్ రెడీ అయ్యిందట. ఈ టీజర్ చూసిన ఏజెంట్ టీమ్ మెంబర్స్ అయితే.. ఏజెంట్ టీజర్ అదిరింది అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం వైరల్ గా మారింది.
దీంతో ఏజెంట్ టీజర్ పై మరిన్ని అంచనాలు పెరిగాయి. ఇక రిలీజ్ డేట్ విషయానికి వస్తే.. ఆగష్టు 12న విడుదల చేయనున్నట్టుగా గతంలో ప్రకటించారు. అయితే.. షూటింగ్ ఆలస్యం అవ్వడం వలన వాయిదాపడింది. లేటెస్ట్ న్యూస్ ఏంటంటే.. సెప్టెంబర్ 30న ఏజెంట్ చిత్రాన్ని భారీ స్థాయిలో విడుదల చేసేందుకు ఫిక్స్ చేసారని సమాచారం. మరి.. భారీ అంచనాలతో వస్తున్న ఏజెంట్ అఖిల్ ఆశించిన విజయాన్ని అందిస్తుందేమో చూడాలి.