Monday, February 24, 2025
HomeసినిమాAgent Akhil: అభిమానుల సమక్షంలో అఖిల్ బర్త్ డే వేడుకలు

Agent Akhil: అభిమానుల సమక్షంలో అఖిల్ బర్త్ డే వేడుకలు

అక్కినేని అఖిల్ నటించిన లేటెస్ట్ మూవీ ‘ఏజెంట్’ సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాను అనిల్ సుంకర నిర్మించారు. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కీలక పాత్ర పోషిస్తున్నారు. ఎప్పటి నుంచో సెట్స్ పై ఉన్న ఏజెంట్ మూవీ కోసం అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. చాలా సార్లు వాయిదా పడిన ఈ మూవీని ఈసారి ఏప్రిల్ 28న ఎలాగైనా సరే రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు.

నిన్న అఖిల్ పుట్టినరోజు, షూటింగ్ చివరి దశలో ఉండడంతో ఈసారి పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉండి, సినిమా సక్సెస్ అయిన తర్వాత అందరికీ గ్రాండ్ పార్టీ ఇవ్వలనుకున్నారట. అయినప్పటికీ.. అభిమానులు ఒత్తిడి మేరకు బర్త్ డే సెలబ్రేషన్స్ జరుపుకోక తప్పలేదు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. స్పై థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఏజెంట్ మూవీ పై భారీ అంచనాలు ఉన్నాయి. మరి.. ఏజెంట్ మూవీతో అఖిల్ బ్లాక్ బస్టర్ సాధిస్తాడేమో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్