Saturday, January 18, 2025
Homeసినిమాఅటు 'ధీర' .. ఇటు 'లెనిన్'గా అఖిల్!

అటు ‘ధీర’ .. ఇటు ‘లెనిన్’గా అఖిల్!

అఖిల్ హీరోగా తన కెరియర్ ను మొదలుపెట్టి చాలాకాలమే అవుతోంది. అయితే ఇంతవరకూ ఆయన నుంచి అభిమానులు ఆశిస్తున్న స్థాయి హిట్ పడలేదు. అలాంటి ఒక భారీ హిట్ కోసమే అఖిల్ కూడా వెయిట్ చేస్తున్నాడు. అఖిల్ చేసిన ‘ఏజెంట్’ పరాజయం పాలైంది. ఈ సినిమాపై అఖిల్ చాలా నమ్మకం పెట్టుకున్నాడు. కానీ ఫలితం చాలా నిరాశపరిచింది. దాంతో తరువాత ప్రాజెక్టుల విషయంలో అఖిల్ మరిన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు.

యూవీ క్రియేషన్స్ బ్యానర్లో అఖిల్ ఒక భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ చేయనున్నట్టు వార్తలు వచ్చాయి. ఆ ప్రాజెక్టు సెట్ కావడం నిజమేననే విషయం బయటికి వచ్చింది. చారిత్రక నేపథ్యంతో కూడిన కథ ఇది. అందువలన ఈ సినిమాకి ‘ధీర’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్టుగా టాక్. అనిల్ అనే యువ దర్శకుడు ఈ సినిమాతో పరిచయం కానున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన సన్నాహాలు జరుగుతూ ఉండగానే అఖిల్ మరో ప్రాజెక్టుకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

మురళీ కిశోర్ అబ్బూరి దర్శకత్వంలో చేయడానికి అఖిల్ అంగీకరించినట్టు సమాచారం. ఇటీవల ఆయన వినిపించిన కథ నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని అంటున్నారు. ఈ కథ నాగార్జునకు కూడా బాగా నచ్చేసిందట. అందువల్లనే చైతూతో కలిసి ‘మనం’ బ్యానర్ పై ఆయన ఈ సినిమాను నిర్మిస్తున్నారని చెబుతున్నారు. ఈ సినిమాకి ‘లెనిన్’ అనే టైటిల్ ను ఖరారు చేసే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టుకి సంబంధించిన ప్రకటన త్వరలోనే వెలువడనున్నట్టు తెలుస్తోంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్