Sunday, January 19, 2025
HomeసినిమాAgent OTT: 'ఏజెంట్' కు ఏమైంది..? ఓటీటీలో రిలీజ్ కాదా..?

Agent OTT: ‘ఏజెంట్’ కు ఏమైంది..? ఓటీటీలో రిలీజ్ కాదా..?

అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి తెరకెక్కించిన మూవీ ‘ఏజెంట్’. ఈ చిత్రాన్ని అనిల్ సుంకర నిర్మించారు. ఇందులో అఖిల్ కు జంటగా సాక్షి వైద్య నటించింది. దాదాపు 80 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందింది. అయితే.. బాక్సాఫీస్ దగ్గర ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. అఖిల్ కెరీర్ లో డిజాస్టర్ మూవీగా నిలిచింది. ఈ సినిమా కోసం ఆఖిల్ చాలా కష్టపడ్డాడు. భారీగా ప్రమోషన్స్ చేశారు కానీ.. సినిమాలో కంటెంట్ లేకపోవడంతో అఖిల్ పడ్డ కష్టం వేస్ట్ అయిపోయింది. దీంతో అభిమానులును బాగా నిరాశ పరిచింది.

థియేటర్లోకి వచ్చిన ఏజెంట్ ఇంత వరకు ఓటీటీలోకి రాలేదు. సోనీ లివ్ లో ఏజెంట్ మూవీ అంటూ అనౌన్స్ మెంట్ ఇచ్చారు. థియేటర్లో రిలీజైన రెండు వారాలకే ఈ సినిమాని డిజిటల్ గా రిలీజ్ చేయాలి అనుకున్నారు కానీ.. ఎందుకో తర్వాత ఆ నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నారు. ఓటీటీలో అనుకున్న టైమ్ కి రిలీజ్ కాకపోవడంతో కారణం ఏంటని ఆరా తీస్తే.. ఈ సినిమాని మళ్లీ ఎడిటింగ్ చేస్తున్నారని ఓ వార్త బయటకు వచ్చింది. ఆతర్వాత ఏజెంట్ ఓటీటీ రిలీజ్ గురించి ఎలాంటి అప్ డేట్ లేదు. ఏజెంట్ ఓటీటీలోకి ఇంత వరకు రాకపోవడానికి కారణం ఏంటి అనేది ఆసక్తిగా మారింది.

ఏజెంట్ మూవీ డిజాస్టర్ అవ్వడంతో ముందు చెల్లిస్తామన్న మొత్తం ఇవ్వడానికి సొనీ లీవ్ వాళ్లు వెనుకంజ వేసి ఉండొచ్చు అనే టాక్ వినిపిస్తుంది. ఏది ఏమైనా ఏజెంట్ మూవీని థియేటర్లో మిస్ అయి ఓటీటీలో చూద్దామనుకునే వాళ్లు ఇంకా ఎందుకు స్ట్రీమింగ్ కాలేదో తెలియక ఫీలవుతున్నారని టాక్. నిర్మాత అనిల్ సుంకర నుంచి దీనికి సంబంధించి ఎలాంటి అప్ డేట్ లేదు. ఏజెంట్ డిజాస్టర్ అవ్వడంతో అఖిల్ కూడా సైలెంట్ అయిపోయాడు. ప్రస్తుతం నెక్ట్స్ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో బిజీగా ఉన్నాడు. మరి.. ఏజెంట్ ఓటీటీలో ఎప్పుడు వస్తుందో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్