Tuesday, March 17, 2026
HomeసినిమాPuri Jagannadh, Surender Reddy: నిన్న పూరి, నేడు సూరి..

Puri Jagannadh, Surender Reddy: నిన్న పూరి, నేడు సూరి..

పూరి జగన్నాథ్..  హీరో విజయ్ దేవరకొండ కాంబినేషన్లో రూపొందిన చిత్రం ‘లైగర్’. ఈ సినిమా కోసం విజయ్ సిక్స్ ప్యాక్ చేశాడు. చాలా కష్టపడ్డాడు. పాన్ ఇండియా రిలీజ్ కాబట్టి దేశమంతా తిరిగి ప్రమోషన్స్ చేశాడు. అతను వెళ్లిన ప్రతి చోట అనూహ్యమైన స్పందన వచ్చింది. ఆ జనాలను చూసి ఈ సినిమాతో ఇండియా షేక్ అవుతుంది అంటూ విజయ్ లైగర్ మూవీ గురించి చాలా ఎక్కువే మాట్లాడాడు. అయితే.. లైగర్ థియేటర్లోకి వచ్చిన మొదటి రోజే అన్ని చోట్లా డిజాస్టర్. ఆ ఫలితం నుంచి విజయ్ దేవరకొండ ఇంకా పూర్తిగా కోలుకోలేదు.

ఇప్పుడు అఖిల్ అక్కినేనిది కూడా దాదాపుగా అదే పరిస్థితి. సురేందర్ రెడ్డి మీద నమ్మకంతో రెండేళ్లు పాటు బాగా కష్టపడ్డాడు. మొత్తానికి బాడీని మార్చేసుకున్నాడు. ఈ సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో సక్సెస్ సాధిస్తానని.. బ్లాక్ బస్టర్ ఖాయమని బలంగా నమ్మాడు. నిర్మాత అనిల్ సుంకర అయితే.. ఈ సినిమాతో అఖిల్ సూప్ స్టార్ అవుతాడు అంటూ సినిమా పై అంచనాలను పెంచేశాడు. అక్కినేని అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్న ఏజెంట్ మూవీ థియేటర్లోకి వచ్చింది కానీ.. ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోలేదు. రివ్యూస్ బ్యాడ్ గా వచ్చాయి అలాగే మౌత్ టాక్ కూడా దారుణంగా ఉంది.

లైగర్, ఏజెంట్ సినిమాల్లో ఓ కామన్ ఎలిమెంట్ ఉంది. ఏంటంటే.. లైగర్ సాలా క్రాస్ బ్రీడ్ అంటూ హడావిడి చేశారు. ఏజెంట్ కోసం వైల్డ్ సాలా అంటూ హంగామా చేశారు. రెండింటిలోనూ సాలా ఉంది. ఈ హిందీ పదం తెలుగు జనాలకు నచ్చలేదో.. కలిసి రాలేదో కానీ… దారుణంగా ప్లాప్ అయ్యాయి. కథ పై సిన్సియర్ గా వర్క్ చేయకుండా కాంబినేషన్ మీద కాన్ సన్ ట్రేషన్ చేసి సినిమాలు చేస్తే ఇలాగే ఉంటుంది అంటున్నారు సినీ జనాలు. అందుకనే.. నిన్న పూరి.. నేడు సూరి అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular