Saturday, March 14, 2026
Homeసినిమాఅఖిల్ కు బర్త్ డే పోస్టర్ గిఫ్ట్

అఖిల్ కు బర్త్ డే పోస్టర్ గిఫ్ట్

Birthday Gift: యంగ్ అండ్ డైనమిక్ స్టార్ అక్కినేని అఖిల్ హీరోగా దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అనిల్ సుంకర ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్‌, సురేందర్ 2 సినిమా బ్యానర్స్ పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ‘ఏజెంట్’ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. అఖిల్ పుట్టినరోజు సందర్భంగా ‘ఏజెంట్’ యూనిట్ సరికొత్త పోస్టర్ తో విషేష్ తెలిపింది. ‘ఏజెంట్’ పాత్ర ప్రకారం అఖిల్ ఇది వరకటి సినిమాల కంటే పూర్తి భిన్నంగా కనిపించబోతున్నారు. ఫుల్ లెంత్ యాక్షన్ రోల్ చేస్తున్న అఖిల్ ‘ఏజెంట్’ పాత్ర కోసం పూర్తిగా మేకోవ‌ర్ అయ్యారు.

తాజాగా విడుదల చేసిన పోస్టర్ లో కండలు తిరిగిన శరీరంతో స్టయిలీష్ గా సిగరెట్ తాగుతూ ‘ఏజెంట్‘ యాటిట్యూడ్ తో కనిపించడం అభిమానులు ఆకట్టుకుంది. ‘ఏజెంట్’ పాత్ర కోసం అఖిల్ ఎంతలా మేకోవ‌ర్ అయ్యారో చెప్పడానికి ఈ పోస్టర్ నిదర్శనంగా నిలిచింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. స్పై థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అఖిల్ సరసన సాక్షి వైద్య కథానాయికగా నటిస్తోంది. ప్రముఖ రచయిత, దర్శకులు వక్కంతం వంశీ ఈ చిత్రానికి కథ అందించారు.

ఈ చిత్రానికి హిప్ హాప్ తమిజా సంగీతం అందించగా, రసూల్ ఎల్లోర్ ఛాయాగ్రహకుడిగా పని చేస్తున్నారు. నవీన్ నూలి ఎడిటర్‌గా, అవినాష్ కొల్లా ఆర్ట్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. అజయ్ సుంకర, దీపా రెడ్డి ఈ చిత్రానికి సహ నిర్మాతలు. ఆగస్టు 12న ప్రపంచవ్యాప్తంగా ‘ఏజెంట్ ‘చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Also Read : అఖిల్ ‘ఏజెంట్’ రిలీజ్ డేట్ ఫిక్స్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular