Saturday, January 18, 2025
Homeసినిమాఉగాదికి అఖిల్ మూవీ ఎనౌన్స్ మెంట్! 

ఉగాదికి అఖిల్ మూవీ ఎనౌన్స్ మెంట్! 

అఖిల్ మంచి అందగాడు .. యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. డాన్సులు .. ఫైట్ల విషయంలోను తానేమిటన్నది నిరూపించుకున్నాడు. హీరోగా ఇంతవరకూ ఐదు సినిమాలు చేశాడు. అయితే ఈ ఐదు సినిమాలు కూడా ఆశించిన స్థాయిలో విజయాలను అందుకోలేకపోయాయి. చివరిగా అఖిల్ నుంచి వచ్చిన ‘ఏజెంట్’ సినిమా కూడా భారీ పరాజయాన్నే నమోదు చేసింది. ఆ సినిమా విడుదలై ఏడాది కావొస్తున్నా ఇంతవరకూ అఖిల్ నుంచి మరో సినిమా ఎనౌన్స్ మెంట్ రాలేదు.

ఈ నేపథ్యంలో అఖిల్ తన 6వ సినిమాను ఏ దర్శకుడితో చేయనున్నాడు? ఎప్పుడు సెట్స్ పైకి వెళ్లనున్నారు? అనేది ఆసక్తికరంగా మారింది. అభిమానుల సందేహానికి ఉగాది రోజున అఖిల్ తెరదించనున్నాడనే ఒక టాక్ ఇప్పుడు బలంగా వినిపిస్తోంది. అఖిల్ తన తదుపరి సినిమాను అనిల్ కుమార్ దర్శకత్వంలో చేయనున్నాడని తెలుస్తోంది. ఈ కుర్రాడు ఇంతకుముందు ‘సాహో’ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసి ఉన్నాడు. అతను చెప్పిన కథ వినగానే అఖిల్ ఓకే చెప్పాడట.

అఖిల్ హీరోగా నటించనున్న ఈ సినిమా, యూవీ క్రియేషన్స్ వారు నిర్మించనున్నారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకి సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. ఉగాది రోజున ఈ ప్రాజెక్టు పూజా కార్యక్రమాలను జరుపుకుంటుందని అంటున్నారు. ఆ తరువాత నెల నుంచి రెగ్యులర్ షూటింగు మొదలవుతుందని చెబుతున్నారు. డిఫరెంట్ లుక్ తో అఖిల్ కనిపించనున్నాడని అంటున్నారు. త్వరలోనే మిగతా వివరాలు తెలియనున్నాయి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్