Thursday, March 12, 2026
HomeసినిమాAkhil Letter: 'ఏజెంట్' ఫ్లాప్ పై అఖిల్ ఏమన్నాడో తెలుసా?

Akhil Letter: ‘ఏజెంట్’ ఫ్లాప్ పై అఖిల్ ఏమన్నాడో తెలుసా?

అక్కినేని అఖిల్ నటించిన భారీ పాన్ ఇండియా మూవీ ఏజెంట్. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమా ను అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మించారు. భారీ అంచనాలతో వచ్చిన ఏజెంట్ మూవీ బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ అయ్యింది. ఈ సినిమా రిలీజైన మర్నాడే ఫ్లాప్ అని స్వయంగా నిర్మాత తేల్చేశారు. అందరికీ సారీ చెబుతూ ఓ లెటర్ కూడా సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. ఇప్పుడు అఖిల్ వంతు వచ్చింది. ఏజెంట్ రిలీజైన ఇన్ని రోజులకు తన రియాక్షన్ ఓ లెటర్ రూపంలో సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

అఖిల్ ఏమన్నాడంటే “నా ప్రియమైన అభిమానులకు నా శ్రేయోభిలాషులందరికీ అలాగే మా సినిమాకి ప్రాణం పోయడం కోసం తమ జీవితాలను అంకితం చేసిన ఏజెంట్ మూవీ నటీనటులు మరియు సిబ్బందికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మేము మా స్థాయిలో ఉత్తమంగా ప్రయత్నించినప్పటికీ దురదృష్టవశాత్తూ ఈ చిత్రం తెర పై మేము కోరుకున్న విధంగా రాలేదు. అలాగే మేము మీ కోసం మంచి చిత్రాన్ని అందించలేకపోయాం. ఇక నాకు పెద్ద సపోర్ట్ గా నిలిచిన నిర్మాత అనిల్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు”

“మా సినిమా పై నమ్మకం ఉంచిన డిస్ట్రిబ్యూటర్లందరికీ మాకు ఎంతో సపోర్ట్ చేసిన మీడియాకు ధన్యవాదాలు. మీరందరూ నాకు ఇచ్చే ప్రేమనే నా శక్తి. మళ్ళీ నేను పని చేయడానికి అదే కారణం. ఇక అందుకు ధ్యాంక్స్ తెలియచేస్తున్నాను. నన్ను నమ్మిన వారందరికీ నేను బలంగా మళ్ళీ మరో సినిమాతో మీ ముందుకు తిరిగి వస్తాను” అంటూ అఖిల్ వివరించాడు.

అయితే.. ఊహించని విధంగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి గురించి ఏ మాత్రం స్పందించలేదు. ఇప్పటికే నిర్మాత ఇన్ డైరెక్ట్ గా దర్శకుడు కారణం అని తెలియచేస్తూ.. బౌండెడ్ స్క్రిప్ట్ రెడీ చేయకపోవడం సినిమా అపజయానికి ప్రధానం కారణం అన్నట్లు వివరణ ఇచ్చారు. ఇక ఇప్పుడు అఖిల్ కూడా అసలు సురేందర్ పేరు ఎత్తకపోవడంతో ఏదో జరిగే ఉంటుందనే టాక్ వినిపిస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular