Saturday, January 18, 2025
Homeసినిమాసిక్స్ ప్యాక్ తో అదరగొట్టిన అఖిల్

సిక్స్ ప్యాక్ తో అదరగొట్టిన అఖిల్

అక్కినేని అఖిల్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఏజెంట్’. ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ భారీ యాక్షన్ మూవీ కోసం అఖిల్ చాలా కసరత్తు చేశాడు. తనలోని అసలుసిసలు మాస్ చూపించేందుకు కండలు బాగా పెంచాడు. అలాగే సిక్స్ ప్యాక్ చేశాడు. కండలతో పాటు పచ్చబొట్టు కూడా వేయించుకున్నాడు. ఈరోజు ఏజెంట్ మూవీ షూటింగ్ స్టార్ట్ అయ్యింది. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన స్టిల్స్ లో అఖిల్ కష్టం కనిపిస్తుంది. ఇక ఫ్యాన్స్ అయితే.. ఇది కదా మాకు కావాల్సింది అంటున్నారు.

ఈ భారీ చిత్రాన్ని ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌, సురేందర్ టు సినిమా సంస్థలు సంయుక్తంగా రూపొందిస్తున్నాయి. దీనికి వక్కంతం వంశీ కథను అందించారు. ఈ రోజు షూటింగ్ స్టార్ట్ చేసిన సందర్భంగా సురేందర్ రెడ్డి ట్విట్టర్ లో ఏజెంట్ స్టిల్ రిలీజ్ చేసి.. ఇది బిగినింగ్ మాత్రమే.. మీకు ముందు ముందు ఉంది పండగ అంటూ అభిమానుల్లో అంచనాలను రెట్టింపు చేశారని చెప్పచ్చు. ఈ సినిమాలో అఖిల్ సరసన సాక్షి వైద్య కథానాయికగా నటిస్తోంది. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమన్‌ సంగీతం అందిస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్