Saturday, March 14, 2026
HomeసినిమాAgent Movie Press Meet: నా జీవితాన్ని మార్చిన చిత్రం 'ఏజెంట్' - అఖిల్

Agent Movie Press Meet: నా జీవితాన్ని మార్చిన చిత్రం ‘ఏజెంట్’ – అఖిల్

అఖిల్, సురేందర్ రెడ్డిల క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘ఏజెంట్’. ఈ చిత్రాన్ని అనిల్ సుంకర నిర్మించారు. ఏప్రిల్ 28న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. మేకర్స్ సినిమాని జోరుగా ప్రమోట్ చేస్తున్నారు. ప్రమోషనల్ కంటెంట్ కు  అద్భుతమైన స్పందన వచ్చింది. ఇప్పుడు, థియేట్రికల్ ట్రైలర్‌కి సమయం వచ్చింది. ట్రైలర్ ఏప్రిల్ 18న విడుదలవుతుందని మేకర్స్ అనౌన్స్ చేశారు. కాకినాడలో భారీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ని ప్లాన్ చేస్తోంది ఏజెంట్ చిత్ర యూనిట్. ఈ నేపధ్యంలో    ఏజెంట్ టీం ప్రెస్ మీట్ నిర్వహించింది.

అఖిల్ అక్కినేని మాట్లాడుతూ.. ఏజెంట్ మోస్ట్ మెమరబుల్ జర్నీ. మెంటల్ గా ఫిజికల్ గా నా జీవితాన్ని మార్చిన చిత్రమిది. ‘నేను మిమ్మల్ని ఇబ్బంది పెడతాను ,మీరు పడాలి’ అని సురేందర్ రెడ్డి గారు నాకు ముందే చెప్పేశారు. ఆ రోజే ఆయనకి మాటిచ్చాను. ఆ ప్రామిస్ తో సినిమా పూర్తి చేశాం. ఈ రోజు నేను కొత్తగా కనిపిస్తున్నానంటే కారణం సురేందర్ రెడ్డి గారే. ఆయన నన్ను ఇలా ఇమాజిన్ చేసి చూపించారు. నేను ఆయన్నే ఫాలో అయ్యాను. ఆయన పూర్తి న్యాయం చేశారు. ఏజెంట్ జర్నీ చాలా తృప్తిని ఇచ్చింది. ఏజెంట్ మానసికంగా బలాన్ని ఇచ్చింది. ఈ జర్నీలో చాలా మంది భాగమయ్యారు. సాక్షి చాలా చక్కగా చేసింది.

ఈ సినిమాతో ఆమెకు మరెన్నో అవకాశాలు వస్తాయి. మమ్ముట్టి గారు నా స్ఫూర్తి. ఆయనతో వర్క్ చేయడం వెరీ మెమరబుల్. చాలా విషయాలు ఆయన నుంచి నేర్చుకున్నాను. ఆయనతో స్క్రీన్ పంచుకోవడం గౌరవంగా భావిస్తున్నాను. రసూల్ గారు సినిమా టోన్ కి బ్యాక్ బోన్. ఏజెంట్ జర్నీ క్రేజీగా వుండింది. క్యారెక్టర్ వైల్డ్ గా వుండింది. ‘ఏజెంట్’ హై ఆక్టేన్ రోలర్ కోస్టర్ రైడ్.. థియేటర్ లో హై మాములుగా వుండదు. ఈ క్రేజీ నెస్ కి ప్రేక్షకులు కనెక్ట్ అవుతారు. ఇలాంటి సినిమాని అనిల్ గారు లాంటి నిర్మాతలే చేయగలుతారు. ఏజెంట్ తో ప్రేక్షకులకు బ్లాక్ బస్టర్ మూవీ ఇస్తున్నామని ఆయన మొదటి రోజు నుంచి చెప్పారు. అందరికీ కృతజ్ఞతలు’’ తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular