Thursday, March 19, 2026
HomeసినిమాAkhil: స్పీడు పెంచే ఆలోచనలో అఖిల్?  

Akhil: స్పీడు పెంచే ఆలోచనలో అఖిల్?  

అక్కినేని అఖిల్ తాజా సినిమా ఏజెంట్ బాక్సాఫీస్ దగ్గర బోల్తాపడింది. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాను అనిల్ సుంకర నిర్మించాడు. ప్రమోషన్స్ చేశారు కానీ.. సినిమా ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. అక్కినేని అభిమానులు బాగా డల్ అయ్యారు. ఏజెంట్ డిజాస్టర్ తర్వాత దుబాయ్ వెళ్లి  వచ్చిన అఖిల్ తన నెక్ట్స్ మూవీ ఏంటనేది ప్రకటించలేదు. ఈసారి సక్సెస్ మిస్ కాకూడదని చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడట.

యు.వి క్రియేషన్స్ బ్యానర్ లో అఖిల్ నెక్ట్స్ మూవీ చేయనున్నాడని వార్తలు వచ్చాయి. ఈ సినిమా టైటిల్ ధీర అని, అ సోషియో ఫాంటసీ మూవీ అని.. ఈ సినిమా ద్వారా అనిల్ అనే కుర్రాడు దర్శకుడిగా పరిచయం కానున్నాడని టాక్ వచ్చింది. ఈ సినిమాని అనౌన్స్ చేస్తారనుకుంటే.. ఇప్పుడు మరో ప్రాజెక్ట్ గురించి వార్తలు వస్తున్నాయి. ఏంటంటే.. అఖిల్.. శ్రీకాంత్ అడ్డాలతో సినిమా చేయనున్నాడని. దీంతో అఖిల్ నెక్ట్స్ మూవీ సస్పెన్స్ గా మారింది.

అఖిల్ ఇక నుంచి వరుసగా సినిమాలు చేయాలి అనుకుంటున్నాడట. అందుకనే బాగా ఆలస్యం అయ్యింది కాబట్టి.. టైమ్ వేస్ట్ కాకుండా వెంటనే సినిమాని స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడట. అయితే.. ఎవరితో సినిమా చేయనున్నాడంటే.. యువీ క్రియేషన్స్ లో చేసే సినిమా, అలాగే శ్రీకాంత్ అడ్డాలతో సినిమాను ఒకేసారి స్టార్ట్ చేయాలి అనుకుంటున్నాడని తెలిసింది. త్వరలోనే ఈ రెండు సినిమాలను అనౌన్స్ చేయనున్నాడని వార్తలు వస్తున్నాయి. అఖిల్ పై అభిమానులు చాలా ఆశలు పెట్టుకున్నారు. మరి… ఈ సినిమాలతో అయినా అఖిల్ సక్సెస్ సాధిస్తాడేమో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular