Sunday, January 19, 2025
Homeసినిమాఅఖిల్ 'ఏజెంట్' రిలీజ్ డేట్ ఫిక్స్

అఖిల్ ‘ఏజెంట్’ రిలీజ్ డేట్ ఫిక్స్

Agent-August: అక్కినేని అఖిల్ న‌టిస్తున్న లేటెస్ట్ మూవీ ఏజెంట్. ఈ భారీ థ్రిల్ల‌ర్ మూవీని స్టైలీష్ డైరెక్ట‌ర్ సురేంద‌ర్ రెడ్డి తెర‌కెక్కిస్తున్నారు. ఏకే ఎంట‌ర్ టైన్మెంట్ బ్యాన‌ర్, సురేంద‌ర్ 2 సినిమాస్ బ్యాన‌ర్స్ పై అనిల్ సుంక‌ర‌, సురేంద‌ర్ రెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భారీ థ్రిల్ల‌ర్ మూవీగా రూపొందుతోన్న ఈ చిత్రంలో మ‌ల‌య‌ళ మెగాస్టార్ మ‌మ్ముట్టి కీల‌క పాత్ర పోషిస్తుండ‌డం విశేషం. ఇటీవ‌ల అఖిల్, మమ్ముట్టిల పై కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించారు.

ఇదిలా ఉంటే.. ఈ రోజు మేక‌ర్స్ ఈ భారీ ఏజెంట్ మూవీని ఆగ‌ష్టు 12న ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు రానున్న‌ట్టుగా  అఫిషియ‌ల్ గా ప్ర‌క‌టించారు. అంతే కాకుండా ఈ మూవీ నుంచి ఓ పోస్ట‌ర్ రిలీజ్ చేశారు. ఈ పోస్ట‌ర్ లో అఖిల్ గ‌న్ ప‌ట్టుకుని చాలా స్టైలీష్ గా క‌నిపించాడు. ఈ పోస్ట‌ర్ కి అనూహ్య‌మైన స్పంద‌న వ‌స్తోంది. ఈ చిత్రానికి ధృవ ఫేమ్ హిప్ హాప్ తమీజా సంగీతం అందిస్తున్నారు. అఖిల్ స‌రికొత్త‌గా ప‌వ‌ర్ ఫుల్ గా క‌నిపించ‌నున్న ఏజెంట్ మూవీతో బ్లాక్ బ‌స్ట‌ర్ సాధించ‌డం ఖాయం అంటున్నారు అభిమానులు. మ‌రి.. ఏజెంట్ ఏ రేంజ్ సక్సెస్ సాధిస్తాడో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్